CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ చేతుల మీదుగా రక్త దానం కార్యక్రమం ప్రారంభం

Share it:

 



రక్త దానం చేద్దాం ప్రాణాలను కాపాడుదాం

మన్యం టీవీ మంగపేట.


ఈరోజు ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో

రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా

రక్తదాన శిబిరాన్ని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమన్నీ ప్రారంభించారు. 


ఈ సందర్భంగా కుసుమ జగదీష్ మాట్లాడుతూ

రక్త దానం చేయడానికి మీరు అందరూ ముందుకు రావడం శుభ పరిమాణం.

రక్తదానం ప్రాణ దానం యువకులు అందరూ ఇలాంటి మంచి కార్యక్రమంలో కలిసి రావాలి అని పిలుపునిచ్చారు. ప్రతి రోజు ఎంతో మంది పలు రకాల సమస్యల వలన, ప్రమాదాల వలన రక్తం దొరకక పోతున్నాయి అటువంటి నిస్సహాయ స్థితి నుండి సహాయం అందించగల స్థితికి రావాలి అంటే యువత స్వచ్చందంగా ముందుకు రావాలి, విరివిగా రక్త దానం చేసి రక్తపు నిల్వలు పెంచాలి తద్వారా మనం వారికీ ప్రాణ దాతలు కావాలి అంటూ రక్త దానం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేసి యువత ను ముందు ముందు ఇటువంటి మంచి కార్యక్రమాలకు చేయూతనువ్వాలని ఈ సందర్బంగా కోరారు.


రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు వారిని జడ్పీ చైర్మన్ ఈ సందర్బంగా అభినందించారు.

ప్రజలకు మానవాళికి మంచి చేసే ప్రతి కార్యక్రమానికి

పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తాను అని జడ్పీ చైర్మన్ తెలిపారు.

రక్త దానం చేసిన వారికి సర్టిఫికేట్ లను అందజేశారు.

అనంతరం పిలవగానే ఇటువంటి మంచి కార్యక్రమం నకువిచ్చేసిన జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు శాలువా తో సత్కరించారు. 


ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, సుంకోజు ద్రోణాచారి,వేల్పుల దేవరాజు,కొమరం అంద్రయ్య,వి. ప్రేమనందం,ఎస్ బర్నాబాస్, జీ.ప్రసాద్,డి .లక్ష్మయ్య,ఎన్ కొమరయ్య,జి సురేష్,ఐ శ్రీను,కే .బాబు తెరాస మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,జిల్లా నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ,పిఎసియస్ చైర్మన్ తోట రమేష్,జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,పోరిక గోవింద్ నాయక్,తాహిర్ పాషా,దళిత సేవ సమితి జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య,మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,

మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ , మండల ప్రధాన కార్యదర్శి గుండేటి  రాజు యాదవ్,వైఎస్ చైర్మన్ కడబోయిన నరేందర్,పిఎసియస్ డైరెక్టర్లు, నర్రా శ్రీధర్  సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,అచ్చ సత్యనారాయణ నర్సయ్య,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి, చిలకమర్రి రాజేందర్ ,చిట్టిమల్ల సమ్మయ్య, మహిళ అధ్యక్షురాలు కాటూరి సుగుణ,నూనె లింగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: