CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశభక్తిని చాటుకున్న జూలూరుపాడు మెకానిక్స్ వర్కర్స్ అసోసియేషన్..

Share it:

 


👉 450 అడుగుల భారీ త్రివర్ణ పతాక జండా ప్రదర్శన..



మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో మెకానిక్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 450 అడుగుల భారీ త్రివర్ణ పతాక జెండాను మెకానిక్స్ మరియు ఆటో డ్రైవర్స్ శనివారం ప్రదర్శణ చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు తడిసిన వెంకటరెడ్డి మరియు రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలో 450 అడుగుల త్రివర్ణ పతాక జెండాను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. మెకానిక్స్ అంటే కేవలం చెడిపోయిన వాహనాలను, పరికరాలను, బాగుచేసే వ్యక్తులే కాదు సమాజ సేవలో సైతం తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని, చెడిపోతున్న భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను, మానవ సంబంధాలను సైతం బాగుచేయడానికి ముందువరుసలో ఉంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తుందని తెలిపారు. కానీ మెకానిక్ లను ఇస్మరించారని అన్నారు. ఇకనైనా మెకానిక్ కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి షరతులు లేని బ్యాంకు రుణాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా మెకానిక్ సోదరులు రోడ్డు పక్కనే పని చేస్తుండడంతో పొల్యూషన్ కారణంగా అనేక రకాల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారినపడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాబట్టి మెకానిక్ లకు ప్రభుత్వమే ప్రమాద బీమా కల్పించాలని, మెకానిక్ లందరికీ హెల్త్ కార్డులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సొంద్ మియా, ఉపాధ్యక్షులు సిహెచ్ సంతోష్, కార్యదర్శి హరి, గౌరవ సలహాదారులు చారీ, యయాతి,రాజు, కోశాధికారి బియన్ రావు, కార్యవర్గ సభ్యులు, ఆటో యూనియన్ సభ్యులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: