CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ పోలీస్ మహిళల రక్షణ కై కృషి చేస్తున్న షీ టీం అవగాహన సదస్సులు

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 18,(మన్యం మీడియా)

కొత్తగూడెం స్థానిక అంబేద్కర్ భవన్ లో జరిగిన షీ టీమ్ సదస్సులో సి ఐ వెంకటేశ్వరరావు, ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యువతకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరిగిన ఎవరైనా చీటింగ్ చేసిన తక్షణమే హండ్రెడ్ డైల్ లేదా 7901145721 కి కాల్ చేయండి తక్షణమే స్పందించి మీకు రక్షణ గా ఉంటాము అని చెప్పడం జరిగినది, ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాలు పాల్గొనడం జరిగినది, ఈ సందర్భంగా (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు) నాయకురాలు కరీష రత్నకుమారి మాట్లాడుతూ రోజు రోజు కి మహిళలపై జరుగుతున్న దాడులు బాలికలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి మొన్న ఆంధ్ర గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై వందలాది మంది ప్రత్యక్షంగా చూస్తున్న పట్టపగలే హత్య చేయడం నిన్నటికి నిన్న గాంధీ హాస్పిటల్ లో అక్క చెల్లెలని మత్తుమందిచ్చి ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచార ఘటన ఇలా ఇంకా ఎన్నో జరుపుతున్నాయి అని అన్నారు మహిళలకు అవగాహన లేక ఇలాంటి మోసాలకు బలవుతున్నారు షీ టీమ్ లు ఏర్పాటు చేసి ఇలా అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉంది గాంధీ హాస్పిటల్ లో మహిళలపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ అలాంటి నేరగాళ్లను విచారణ జరిపి ఎన్ కౌంటర్ చేయాలి లేదా ఉరిశిక్ష వేయాలి అని మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తున్నాం అని అని తెలిపారు అదేవిధంగా ఇలాంటివారిని అసలు వదిలిపెట్ట వద్దు, యువత కాని మహిళలు కానీ షీ టీమ్ ఫై అవగాహన కలిగి ఉండాలి, ఫేస్బుక్ పరిచయాల వలన చాలా మంది యువత మోసపోతున్నారు, అలాంటి వాటికి దూరంగా ఉండాలి, మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన షీ టీమ్ కి డయల్ చేయవచ్చు అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు నూతన సాంకేతిక పరిజ్ఞాన వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది, ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు అనిల్,WPC శిరీష,మాజీ కౌన్సిలర్ నీల తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: