CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వలస వచ్చిన గిరిజనేతరులు గిరిజన గిరిజనేతరుల మధ్య చిచ్చు పెడుతున్నారు-గొప్ప వీరయ్య గిరిజన నాయకులు.

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


 మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య ఒక ప్రకటనలో మాట్లాడుతూ గిరిజనేతర సోదరులారా బాగా గమనించండి. మంగపేట మండలంలోని పూర్వం గిరిజనేతరులు స్థానిక ఎస్ సి, ఓ సి, బి సి, ఎఫ్ సి కులముల సోదరులతో మాకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి గిరిజనులు మంచిగా చూస్తున్నారు. పూర్వపు ఎస్ సి, ఓ సి, బి సి, ఎఫ్ సి కులముల సోదరులతో గిరిజనులకు ఎలాంటి తగాదాలు విభేదాలు లేవు. అన్నదమ్ముల వలె కలిసి మెలసి జీవనం సాగిస్తున్న వారి మధ్య చిచ్చు పెడుతున్నది వలస గిరిజనేతరులు. 1973లో ఒక కోయ బ్రహ్మానంద గుంటూరు వాసి గిరిజనేతరుడు హైకోర్టులో కేసు పెట్టి ఇంతవరకు నాన్ ట్రైబల్ మండలం అంటూ కేసు తీర్పు తీసుకురాలేదు. అట్టి కేసుకు సంబంధించిన ఆధారాలు గిరిజనులము తీసుకువచ్చిన కాగితము ఆధారంగా 17 ఏప్రిల్ 2014 లో ట్రైబల్ మండలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పూర్వం నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన గిరిజనులకు, గిరిజనేతరులకు పట్టుమని పది ఎకరాల భూమి కూడా లేదు. వలస వచ్చిన గిరిజనేతరులకు సుమారు పది ఎకరాల నుండి 150 ఎకరాల వరకు ఉన్నాయి. ఇక్కడ పుట్టి పెరిగిన వారికి లేవు. ఒక ఒంటరి ముస్లిం మహిళ (నాన్ ట్రైబల్) అయ్యా నాకు న్యాయం చేయండి అంటూ గొప్ప వీరయ్య దగ్గరికి, గిరిజన సంఘాల వారి వద్దకు 20 రోజులు తిరిగినప్పుడు గిరిజనులు స్పందించడం జరిగింది తెలియజేశారు. ఈ సమావేశంలో మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య,మన్యసీమ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నల్లబోయిన లక్ష్మణ్ రావు, మన్యసీమ పరిరక్షణ సమితి మండల అధ్యక్షులు ఆదినారాయణ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: