CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మెగా పార్క్ కొరకు స్థలం పరిశీలించిన ఎంపీపీ

Share it:

 


 


 మన్యంటీవీ, అశ్వారావుపేట:

 తెలంగాణా రాష్ట్రం ఏంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మెగా పార్క్ బ్రహుత్ పల్లె ప్రకృతి వనం (బీపీపీవీ) పార్క్ అశ్వారావుపేట మండలంలో నిర్మించడానికి కేటాయించిన స్థలాన్ని శనివారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లి పల్లి శ్రీరామమూర్తి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి పల్లె ప్రకృతి వనం నిర్మించటం జరిగిందని అలాగే ఇప్పుడు పట్టణాలలో కూడా ప్రజలు ఆహ్లాదంగా కొంత సమయం ప్రశాతంగా సేద తీరడానికి అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రకృతి వనాన్ని నిర్మిస్తున్నారు. ఈ బృషుత్ పల్లె ప్రకృతి వనానికి నిర్మాణానికీ కావాల్సిన స్థలాన్ని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వెనుక ప్రదేశంలో సుమారు 8 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు అశ్వారావుపేట పంచాయతీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ స్థలాన్ని రోజు మండల ప్రజా పరషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు ఎంపీడీఓ విద్యాధర రావు, ఎఈ శ్రీనివాసరావు, శ్యామ్ మరియు అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, ఈఓ హరికృష్ణ అలాగే తెరాస పార్టి యూత్ నాయకులు సొమని శ్రీను అశ్వారావుపేట పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: