CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాసర ఐఐఐటి ఓపెన్ కాంపిటిషన్ లో సీటు సాధించిన ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


ఆర్ జి యు కే టి బాసర ప్రకటించిన విద్యార్థుల సెలక్షన్ లో ఎక్సలెంట్ విద్యార్థి ఓపెన్ కోటాలోనే సీటు సాధించి, మాకు మేమే సాటి మాకు ఎవరు లేరు పోటీ అన్నట్లు అత్యున్నతమైన గ్రేడ్ తో రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో సైతం విజయబావుటా ఎగురావేసాడు. ఎక్సలెంట్ బాషా హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి పండ్రామీసు గణేష్ ఆర్ జి యు కే టి బాసర ఐఐఐటి కోసం నిర్వహించిన పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 897 ర్యాంక్ తో 96 మార్కులతో ఓపెన్ కాంపిటిషన్ లో బాసర ఐఐఐటి కి ఎంపిక అయ్యాడు.ఈ సందర్బంగా ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ మహమ్మద్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ ఎక్సలెంట్ విద్యార్థులు ఈ రకంగా ర్యాంకులు తెచ్చుకోవడం ఉన్నత చదువులకు ఎంపిక అవడం మా విద్యార్థులకు గత ఎన్నో సంవత్సరాలనుండి అలవాటుగా సంప్రదాయంగా మారింది కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆర్ జి యు కే టి పరీక్షలో 96 మార్కులు సాధించి బాసర ఐఐఐటి కి ఎంపిక అవడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్బంగా తెలియజేసారు. ఈ సందర్బంగా ఎక్సలెంట్ డైరెక్టర్స్ మహమ్మద్ ఖాదర్, గబ్బర్, ముక్కు వెంకటనర్సారెడ్డి, బండారు నరేందర్, ఎక్సలెంట్ బాషా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్ తదితరులు పండ్రామీసు గణేష్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొని బాసర లో సీటు సంపాదించిన సందర్బంగా అభినందనలు తెలియజేసారు.

Share it:

Post A Comment: