CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

❇️ అబ్బుగూడెం గ్రామపంచాయతీలో కొరవడిన పారిశుద్ధ్యం పనులు ❇️

Share it:


🔥 గ్రామ పంచాయతీ అధికారి పై గ్రామస్తులు ఆగ్రహం.

◆ మండల ప్రజా పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు.

■ రాత్రికి రాత్రి పారిశుద్ధ్య పనులు చక్కబెడుతున్న వైనం.

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: పచ్చని పల్లె గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ లేక విష జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన, గ్రామ పంచాయతీ అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల ప్రజా పరిషత్ అధికారికి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. వివరాల్లోకెళ్తే అన్నపురెడ్డిపల్లి మండలంలోని అబ్బుగూడెం గ్రామ పంచాయతీలో గత ముప్పై ఐదు రోజుల నుండి పారిశుద్ధ్య పనుల నిర్వహణ, దోమల మందు పిచికారి చేయక విష జ్వరాల బారిన పడుతున్నామని, మంచినీటి ట్యాంకును క్లోరినేషన్ చేయడం లేదని, డ్రైవింగ్ లైసెన్స్ అర్హత లేని వారితో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వాహనాన్ని నడిపిస్తున్నారని అందువల్ల గతంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురై ప్రాణాపాయం తప్పిందని, గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తూ, స్థానికంగా ఉండి పర్యవేక్షించాల్సిన అధికారి. విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తూ నామమాత్రంగా గ్రామ పంచాయతీకి వచ్చి వెళ్తున్నారని, గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల వివరాలను సైతం గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డులో పెట్టి తెలియపరచుటలేదని విన్నవిస్తూ, గ్రామ పంచాయతీ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోగలరు అని ఆవేదన వ్యక్తం చేస్తూ, మండల ప్రజా పరిషత్ అధికారికి వినతి పత్రాన్ని గ్రామస్తులు చెరుకూరి ప్రసాద్ మరియు తదితరులు అందజేశారు. గ్రామస్తులు ఫిర్యాదుతో రాత్రికి రాత్రే గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులను గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహించడం విశేషం.

Share it:

Post A Comment: