CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతాయిగూడెం లో పోడుదారుల మరియు,అటవీ సిబ్బంది మధ్య రగడ

Share it:

 


 వెనుదిరిగిన అటవీశాఖ సిబ్బంది...

చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండల పరిధిలో సీతాయిగూడెo గ్రామం లో పోడు దారుల,అటవీ శాఖ సిబ్బంది మధ్య రగడ జరిగింది.(30) సంవత్సరాలుగా అడవితల్లి నమ్ముకుని పోడు వ్యవసాయం చేసుకుంటూ మేము బతుకుతున్నాం, ఇప్పుడు అటవీ శాఖ సిబ్బంది వచ్చి మేము సుమారు 20 ఎకరాల సాగు చేసిన జొన్న పంటను దౌర్జన్యంగా ట్రాక్టర్ తో దున్నుతారు, ఇదేంటని మేం ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. సుమారు అటవీశాఖ సిబ్బంది 20 మంది, పాల్గొన్నారు. రామవరం రేంజర్ సురేష్, సెక్షన్ ఆఫీసర్ బాలాజీ, మస్తాన్ రాజు అటవీ సిబ్బంది ఉన్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ పోడు భూములు వదలమని కన్నీటి పర్యంతమై తున్నారు. ఈ సంఘటనలో పోడు రైతులు కుంజా ఈశ్వరమ్మ, పదం స్వామి, పదం మంగమ్మ, కీసర జయ, గుర్రం వెంకన్న, పదం ఉమా, కొండ్రు వెంకటమ్మ, పదం వెంకటేశ్వర్లు, మరికొందరు పాల్గొన్నారు..

Share it:

Post A Comment: