CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు సేవలో అవార్డు లభించడంతో నా జన్మకు సార్ధకత లభించింది - డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ:-

సొసైటీ అధ్యక్షునిగా మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్ విజయం సాధించి 16 సంవత్సరాలుగా రైతు సేవలో ఉంటూ పాల్వంచ సొసైటీ అధ్యక్షుని తో పాటు 7 సం"లు డీసీసీబీ డైరెక్టర్ గా, 2 సంవత్సరాలు కొత్తగూడెం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా, ఇప్పుడు డీసీఎంస్ వైస్ చైర్మన్ గా పదవులు చేపడుతూ నిత్యం రైతులకు చేరువగా వుంటున్న తన సేవలను గుర్తించి ప్రభుత్వం *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తమ సొసైటీ అధ్యక్షునిగా* ఎంపిక చేయడంతో నా జన్మకు సార్ధకత చేకూరిందని డీసీఎంస్ వైస్ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా *కొత్వాల* కు *జిల్లా కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు* ప్రశాంశా పత్రం అందజేసిన సందర్బంగా సోమవారం స్థానిక సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ పాలకవర్గం సభ్యులు *కొత్వాల* ను ఘనంగా సత్కరించారు. *కొత్వాల* తో కేక్ కట్ చేయించి, శాలువాలతో, బొకే లతో సన్మానించారు. స్వీట్లు పంచారు. ఈ సందర్బంగా *కొత్వాల* మాట్లాడుతూ *కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు* ఆశీస్సులతో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,డైరెక్టర్లు, సొసైటీ సిబ్బంది సహకారంతో *ఉత్తమ సొసైటీ అధ్యక్షుని* గా మరియు 2018 సం"లో అప్పటి పాలకవర్గం, సిబ్బంది సహకారంతో *పాల్వంచ సొసైటీని తెలంగాణా రాష్ట్రంలోనే ఉత్తమ ద్వితీయ సొసైటీగా ఎంపికై షీల్డ్ తో పాటు 20 వేల నగదు అవార్డు* తీసుకున్నామని, ఈ సారి తనను భద్రాద్రి జిల్లా ఉత్తమ అధ్యక్షునిగా ఎంపికచేయడం హర్షనీయమన్నారు. రాబోయే రోజుల్లో పాల్వంచ సొసైటీని తెలంగాణా లోనే ఉత్తమ సొసైటీగా తీర్చిదిద్దేలా పాలకవర్గ సభ్యులు కృషి చేస్తామన్నారు. రైతులు తాము చేపట్టే అభివృద్ధికి సంపూర్ణ సహకారాలు అందించాలని *కొత్వాల* అన్నారు.


ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామమోహనరావు, కనగాల నారాయణ, చౌగాని పాపారావు, సామా జనార్ధన్ రెడ్డి, యర్రంశెట్టి మధు, జరబన సీతారాంబాబు, మైనేని వెంకటేశ్వరరావు,భూక్యా కిషన్, నిమ్మల సువర్ణ,బర్ల వెంకటరమణ,సొసైటీ సీఈఓ జి. లక్ష్మినారాయణ,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: