CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీ గిరిజన క్రీడాకారులు

Share it:

 


★ క్రీడాకారులు " సవలం కృప " మరియు " కిసరి వసంత్ "★

మన్యం మీడియా ప్రతినిధి/ములకలపల్లి:: నిరుపేద ఆదివాసి గిరిజన కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్లే అవకాశం దక్కినా, ఆర్థిక పరిస్థితుల వలన వెళ్లలేని పరిస్థితులకు, దిగులు చెందుతున్న గిరిజన క్రీడాకారుల వైనం. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలోని సీతాయిగూడెం గ్రామపంచాయతీ, గండిప్రోలు గ్రామానికి చెందిన గిరిజన క్రీడాకారులైన సవలం కృప మరియు కిసరి వసంత్ లు క్రికెట్ క్రీడా రంగంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలో ప్రతిభ కనబరిచి, రాబోయే సెప్టెంబర్ నెల 4, 5, 6, తేదీల్లో జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనప్పటికీ,అక్కడికి వెళ్లడానికి సుమారు 10వేయిల రూపాయలు అవుతుంది. కనుక రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చలేక పోతామేమోనని దిగులు చెందుతున్నారు. అందుకు వారి ఆర్థిక పరిస్థితులే కారణం. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి వారికి చేయూతను ఇవ్వాల్సిందిగా పత్రికాముఖంగా కోరుకుంటున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు-కృప-8977224081 మరియు కీసరి వసంత్8008427825

Share it:

Post A Comment: