CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.

Share it:


ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్న ఎంపీపీ రేగా కాళికా జడ్పిటిసి కొమరం కాంతారావు తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అల్లెం కోటి ప్రజాప్రతినిధులు యువత ఆదివాసీ సంఘాల నాయకులు

మన్యం టీవీ కరకగూడెం:ఆగష్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మండలరిదిలోని అన్ని ఆదివాసీ గ్రామలో ఆదివాసీ జెండాలను  ప్రజాప్రతినిధులు, యువత పెద్దలు ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ పచ్చని జెండాలను ఎగురవేశారు.ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సూతరి నాగేశ్వరరావు అధ్వర్యంలో కరకగూడెం మండలరిదిలోని సీతారామపురం గ్రామం నుండి వీరపూరం క్రాస్ రోడ్డు కోమరం బీమ్ విగ్రహం వరకు ఆదివాసీ సంప్రదాయాలతో ర్యాలీ నిర్వహించి కొమరం భీమ్ విగ్రహం వద్ద జెండాను తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అల్లెం కోటి ఎగురవేశారు. అనంతరం కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా జడ్పిటిసి కొమరం కాంతారావు బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ కొమరం వెంకట్ నారాయణ తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు  సూతరి నాగేశ్వరరావు లు కొమరం భీం విగ్రహాన్ని కి పూల వేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం మొత్తంగా సుమారు 475 మిలియన్ల పాపులేషన్ ఉండగా వివిధరకాల తెగలు అనేక రకాల భాషలు మాట్లాడుతున్నారు. ఇందులోని కొన్ని భాషలు అంతరించి పోయే దశలో ఉన్నాయన్నారు.ఇందులో భాగంగానే 1982 సంవత్సరంలో 171దేశాల ప్రతినిధులు ఆదివాసీ రక్షణ కోసం వారి ప్రణాళిక చేసి వారి రక్షణ కోసం  ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూపుల సమావేశం జరిగిందన్నారు. ఆదివాసులకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని ఆగష్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు అన్నారు. ఆదివాసీలు కోసం భారత రాజ్యాంగంలోని 12 వ షెడ్యూల్డ్ లో 5,6 షెడ్యూల్డ్ ల సాంస్కృతిక సంప్రదాయాలు విద్యా, భాష వారి రక్షణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చోటు కల్పించడం జరిగిందని కాని నేటికి ఆదివాసీల విద్యా ,వైద్య ఆర్థికంగా రాజకీయంగా వెనక పడుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పాయం నర్సిహరావు సర్పంచ్ లు ఇర్ప విజయ్ కుమార్ బత్తిని నర్సిహరావు పోలెబోయిన నర్సిహరావు కొమరం విశ్వనాథం తుడుందెబ్బ మణుగూరు డివిజన్ అధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు మండల అధ్యక్షులు ఊకె గణేష్ కొమరం రాంగోపాల్ సిద్దబోయిన శ్రీకాంత్ మల్కం నరేష్ శేఖర్ యవత పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: