CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తీరదు అనుకున్న కల కాంతన్న తో సాధ్యమైంది

Share it:

 



రేగా కాంతారావు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు పొందిన 49 మంది


ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేగా కాంతారావు


మన్యం మనుగడ, పినపాక: 



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మణుగూరు పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ కారణంగా భూ నిర్వాసితులు అయిన వారికి 2021ఆగస్టు 4 వ తారీఖున భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సి ఈ బాలరాజు కార్యాలయం సమీపంలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం జరిగింది. కొన్ని రకాల సాంకేతిక కారణాలు, అర్హతల కారణంగా నిలుపుదల చేసిన 49 మంది యొక్క నియామక పత్రాలను, రేగా కాంతారావు చొరవతో, నియామక పత్రాలను అందజేయడం జరిగింది.నియామక పత్రాలు అందని కారణంగా నిరుత్సాహంతో ఉన్న 49 మంది అర్హులకు ఆగస్టు 4 వ తారీఖున సభా వేదికగా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మాట ఇచ్చిన రేగా కాంతారావు, మాట తప్పకుండా, నెలరోజులు తిరిగేలోపు ఉద్యోగాలను ఇవ్వడం సంతోషాన్ని కలిగించిందని, హైదరాబాదులో కాంతారావు చేతులమీదుగా నియామక పత్రాలను అందుకున్న వారు అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏడు సంవత్సరాల నాటి కల, సాధ్యం కానీ ఉద్యోగం, తెలంగాణ ప్రభుత్వ విప్ కాంతారావు చొరవతో లభించడం చాలా సంతోషంగా ఉందని, ఇంత గొప్ప వ్యక్తి పినపాక నియోజకవర్గ ప్రజలకు దొరకడం సంతోషంగా ఉందని నియామక పత్రాలు పొందిన వ్యక్తుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొందరికే సాధ్యం అవుతుందని, అలాంటి వారిలో రేగా కాంతారావు మొదటి స్థానంలో ఉంటారని అన్నారు.

Share it:

Post A Comment: