CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ పోరాట యోధులకు నివాళులు అర్పించిన వామపక్షాలు

Share it:

 మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్థానిక ఏలూరి భవన్ సీపీఎం పార్టీ కార్యాలయం లో బషీర్ బాగ్ డే సందర్భంగా నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రన్ని ప్రయోగశాల గా మార్చాలని చూసి ఏపీయస్ ఈబీ నీ 3ముక్కలుగా చేసి ప్రైవేటు పరం చేయా లని, విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాక ప్రతి సంవత్సరం 15శాతం పెంచుకునే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఆర్టీసీ ను అమ్మజూసింది.నాడు తొమ్మిది కమ్యూనిస్టు పార్టీలు ఐక్యమై 100రోజులకు పైగా పోరాటం నడిపాయి నేటికీ 21 ఎండ్ల క్రితం ఆగస్టు 28 న వామపక్షాలు చలో అసెంబ్లీ కి పులునిచ్చా యి కాంగ్రెస్ కూడా కలిసి రావడం జరిగింది.శాంతియుతంగా బషీర్ బాగ్ వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళన కారుల పై టీ డి పి ప్రభుత్వం విచక్షణా రహితంగా పోలీసు కాల్పులు. లాటి చార్జి, భాష్ప వాయువు ప్రయోగం,నీటిపిరంగులు,గుర్రాల దాడి చేసి న ఫలితంగా ఖమ్మం కుచెందిన సత్తెన పల్లి రామకృష్ణ,విష్ణువర్ధన్ రెడ్డి,బాలస్వామి లు అసువులు బాశారు,అనేకమంది ఎమ్మెల్యే లు, ప్రజా ప్రతినిధులు కాళ్ళు చేతులు విరిగాయి,బుల్లెట్ గాయాలు అయ్యాయి మరో జలియన్వాలబాగ్ లాగా దుర్ఘటన జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.ఆదేబ్బతో విద్యుత్ ఒప్పందం రద్దు చేసి, మరో 7ఏళ్ళు కరెంటు ఛార్జి లు పెరగలేదు,నాడు వైఎస్సార్ ప్రభుత్వ రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేసింది.ఇప్పుడు కేంద్రం కొత్త విద్యుత్ చట్టం తెచ్చింది స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు అమలు చేయాలని చూస్తుంది.మరో విద్యుత్ పోరాటం చేయవలసి ఉంది,నాటి పోరాట స్ఫూర్తి తో ఈ దేశన్ని కాపాడు కొనడానికి వామపక్షాలు సన్నద్ధం కావాలని అదే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని నాయకులు అన్నారు. సీపీఎం పార్టీ నేతలు అబ్దుల్ నబి,దేవులపల్లి యాకయ్య, తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, సీపీఐ ఏపూరి బ్రహ్మం,బండం నాగయ్య,దేవరకొండ శంకర్, సిపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తుపాకుల నాగేశ్వరరావు,సారంగపాణి,యాకూబ్ షావలి, చంద్రన్న వర్గం నుండి రామ్ సింగ్,మోకాళ్ళ రమేష్,సాంబ,లు మాట్లాడారు.ఈ కార్యక్రమం లో వజ్జా సురేష్,మన్యం మోహనరావు, దారావత్ రాందాస్,లక్క రాజేశ్వరరావు, బయ్య అభిమన్యు, మహమూద్,లక్ష్మణ్ పాసి,సత్యనారాయణ కోరి, శ్రీను,రామిసెట్టి నరసింహారావు, ఎట్టి నరసింహారావు, బొల్లి కొమరయ్య, మోజేస్,ఉపేందర్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: