CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్:విప్ రేగా పై అవాకులు,చవాకులు పేలితే,తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు:కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పనికి మాలిన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్ విప్ రేగా కాంతారావు పై అవాకులు,చవాకులు పేలితే చూస్తూ సహించేది లేదని, వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్డి.జావీద్ పాషా,నైనారపు నాగేశ్వరరావు,ఎంపీటీసీ కణితి.బాబురావు లు హెచ్చరించారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను విమర్శిస్తున్నా కాంగ్రెస్ నాయకుల్లారా మీ స్థాయి ఏమిటో ఒక్కసారి గ్రహించుకోండి,మీ బ్రతుకు ఏమిటో,మీ రాజకీయ చరిత్ర ఏమిటో,మీ ఆగడాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మేము కళ్ళు తెరిస్తే మీ ఆగడాలు బట్టబయలు చేస్తాం,రేషన్ షాప్ డీలర్ల ను,ఇసుక కాంట్రాక్టర్ లను బెదిరిస్తూ పబ్బం గడుపుకునే మీరు,రేగా కాంతారావు విమర్శించే స్థాయి మీదా అనీ మండిపడ్డారు.ఇప్పటికైనా మీ దిగజారుడు రాజకీయాలు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పినపాక నియోజకవర్గంలో సచ్చిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించి,అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేగా ను విమర్శించడం సరికాదన్నారు.రేగా కాంతారావు పట్టుదలతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని,సాగునీటి ప్రాజెక్టులు,బిటిపిఎస్, సింగరేణి భూ నిర్వాసితుల కు ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర రేగా కాంతారావుకే ఉందని అన్నారు. నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి తో ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చలించిపోయి కరోనా కష్టకాలంలో కార్మిక,కర్షక, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి పేద ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్న రేగా కాంతారావును విమర్శించడం తగదన్నారు. చేసే అభివృద్ధి ని చూసి ఓర్చుకోలేకపోతున్నా కాంగ్రెస్ నాయకుల్లారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ తీరు మార్చుకోండి,కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లా గా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించటం సరికాదని, మళ్ళీ విప్ రేగా కాంతారావు గానీ,టిఆర్ఎస్ పార్టీని గానీ నాయకులని గానీ విమర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం మండల,పట్టణ అధ్యక్షురాల్లు పాకాల. రమాదేవి,తుంగల.చంద్రకళ,యువజన విభాగం మండల అధ్యక్షులు రఘుపతి హర్ష నాయుడు,యువజన నాయకులు మాదాడి. రాజేష్,రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: