CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ మండలంలో మొదటిసారిగా మంత్రి పర్యటన

Share it:

 



పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి అజయ్ కుమార్



 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చండ్రుగొండ మండలంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాశనసభ్యులు మెచ్చ నాగేశ్వరావుతో కలిసి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.ముందుగా పోకలగూడెం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ తో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి,గానుగపాడు, రావికంపాడు రైతు వేదికలను ప్రారంభించారు.అనంతరం తిప్పన పల్లి వైకుంఠధామం,పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం చేసి చండ్రుగొండ మండల కేంద్రంలోని రైతు వేదికను ప్రారంభించి,అక్కడ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు వేదికల నిర్మాణం చేపట్టిందని రైతుల సమస్యలు చర్చించుకునేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా నిర్ణయించి ఒక రైతు వేదిక నిర్మించినట్లు తెలిపారు.ప్రతి రైతు వేదికలో ఒక వ్యవసాయ విస్తరణాధికారి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని వారి సేవలను రైతులు వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు.అశ్వారావుపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే పామాయిల్ కేంద్రంగా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా పామాయిల్ కు 17 వేల వరకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని, అదేవిధంగా దేశంలోనే పత్తి పంట ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి విడతలవారీగా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టి గత సంవత్సరం 25 వేల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేశారని,ఆగస్టు 15 నుంచి 50 వేల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని అన్నారు.రైతుబంధు,రైతు బీమా, రుణమాఫీ చేస్తూ రైతులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్,డిసిసి బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి,ఎంపీపీ బానోత్ పార్వతి,జెడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి,జెట్పి కో ఆప్షన్ ఎస్డి రసూల్,సర్పంచ్ లు మల్లిపెద్ది లక్ష్మీ భవాని,వాసం లలిత శివజ్యోతి,ధరావత్ పార్వతి,సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు,ఎంపీటీసీలు దారా బాబు,లంక విజయలక్ష్మి,మండల అధ్యక్షులు నాయకులు బోజ్యా నాయక్,ఉపాధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు,మేడా మోహన్ రావు, ఉన్నం నాగరాజు, బాబురావు,సూర వెంకటేశ్వర్లు,లింగం నాగేశ్వరరావు,మల్లెం వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: