CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉వినియోగదారుల ఫోరం స్టిక్కర్ల ఆవిష్కరణ.

Share it:


*👉వినియోగదారులకు  హాని కలిగించే వస్తువులు అమ్మ కూడదు.

*👉ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ రియాజ్.

మన్యం టీవీ, కొత్తగూడెం, ఆగస్టు 4:- ప్రతి పౌరుడు నుండి,  ప్రధానమంత్రి వరకు వినియోగదారులుకొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయని, వినియోగదారులు తమ హక్కును భంగం కలగకుండా చూడటం వినియోగదారుల ఫోరం లక్ష్యం అని  తెలంగాణ వినియోగదారుల ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్రి యాజ్ అన్నారు. వినియోగదారుడా మేలుకోతెలంగాణ  కార్యక్రమం  బుధవారం జరిగింది.ఈ సందర్భంగా  

కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కమిషనర్  సంపత్ కుమార్ చేతులమీదుగా వినియోగదారుల ఫోరం స్టిక్కర్ల ఆవిష్కరణ జరిగింది. 

ఈ సందర్భంగా రియాజ్  మాట్లాడుతూ ఎక్కువగా వినియోగదారుల ఎక్కడ ఉంటారో అక్కడ స్టిక్కర్లను అతికించడం జరుగుతుందని, ఈ స్టిక్కర్లను చించిన నష్ట పరిచిన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి  చట్టపరమైన

చర్యలకు మీరే బాధ్యులు అవుతారని అన్నారు .  వినియోగదారుల ఫోరం ఒక ఉద్యమంలా ప్రజలలో అవగాహన కల్పిస్తామని,  

కొన్న ప్రతి వస్తువుకు వెంటనే రసీదు తీసుకోవాలని,  వస్తువులు నాసిరకం అనిపిస్తే వెంటనే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని అన్నారు.

ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకోవద్దని. వినియోగదారుల జీవితాలకు హాని కలిగించే వస్తువులు అమ్మ కూడదని వస్తువులపై ముద్రించిన ధర కంటే ఎక్కువ ధరలు వసూలు చేసిన, తూకాలలో కొలతల్లో తేడాలు వచ్చినా,  వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొందుగుల జ్యోతి, యశ్వంత్, మహేష్, శ్రీనివాస్, కనక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: