CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉క్రీడలతో ఆహ్లాదం

Share it:

  


- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ 

- ఉత్సాహంగా క్రికెట్ పోటీలు 

- మురిపించిన కలెక్టర్ బ్యాటింగ్ 

- కెవ్వుకేక అన్న ఉద్యోగులు 

- జోష్ లో విజేతలు.

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 29 మన్యం టీవీ : - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మంచి క్రీడాకారులకు తయారు చేసేందుకు మున్సిపల్ పరిధిలో ఉన్న క్రీడా మైదానాలను వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులోని సాధన క్రీడా మైదానంలో కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ క్రికెట్ కప్ 2021, మహిళలకు మ్యూజికల్ ఛైర్స్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇల్లందు మున్సిపల్ టీము నుండి పోటీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో తాను క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేశారని మున్సిపల్ సిబ్బందిని అభినందించారు. ప్రతి రోజు పని ఒత్తిడిలో బిజిగా ఉండే మున్సిపల్ సిబ్బందికి ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని చెప్పారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శరీర సౌష్టవాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. జీవితం అంటే రోబోట్ లాంటిది కాదని, సరదాగా ఉల్లాసంగా గడపాలని ఆయన సూచించారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రతలో సిబ్బంది కృషి ఎనలేనిదని, ఉదయం 5 గంటల నుండి పారిశుద్య కార్యక్రమాల్లో భాగస్వాములై గ్రామాలను, పట్టణాల్లో పేరుకు పోయిన వ్యర్థాల నుండి దుర్గందం వెదజల్లకుండా పరిశుభ్రం చేస్తున్నారని మీ సేవలు అభినందనీయమని చెప్పారు. ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం కూడా కావడం చాలా సంతోషమని చెప్పారు. క్రీడల్లో గెలుపు, ఓటమి సహాజమని ఇక్కడ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరం విజేతలమేనని ఆయన చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్రీడలు ఎంతో ముఖ్యమని చెప్పారు. అభివృద్ధిలో మున్సిపాల్టీలు పోటీ పడుతూ ముందుకు పోతున్నాయని మార్పును సాధిస్తున్నాయని ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని చెప్పారు. దేశాన్ని రక్షించే సైనికుల వలే మనకు కేటాయించిన విధులను బాద్యతతో చేసుకుంటూ ముందుకు పోవాలని ఆయన పేర్కొన్నారు. ఇల్లందు మున్సిపాల్టీ తరుపున పోటీలో పాల్గొన్న ఆయన మణుగూరు మున్సిపల్ టీముపై 25 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 36 పరుగులు సాధించారు. కొత్తగూడెం మున్సిపల్ టీము పాల్వంచ మున్సిపల్ టీము పోటీ పడగా కొత్తగూడెం మున్సిపల్ టీము విజయం సాధించింది. ఫైనల్ పోరులో ఇల్లందు, కొత్తగూడెం టీములు పోటీ పడగా కొత్తగూడెం టీము వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేయగా ఇల్లందు టీము 77 పరుగులకు ఆ అవుట్ అయ్యింది. ఫైనల్ పోటీలో కలెక్టర్ 11 పరుగులు చేశారు. అలాగే మహిళలకు నిర్వహించిన మ్యూజికల్ ఛైర్స్ పోటీలో 15 మంది పాల్గొనగా కొత్తగూడెం 9వ వార్డు కౌన్సిలర్ రూప, ఇల్లందు కౌన్సిలర్ పద్మ సంయుక్త విజేతలుగా నిలిచినట్లు ఆయన చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మున్సిపల్ సిబ్బందితో నిర్వహించిన క్రికెట్ పోటీలో కలెక్టర్ పాల్గొన్నారు. బెస్ట్ బ్యాట్మెన్ గా కొత్తగూడెం 1వ వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ విజయ్, బెస్ట్ బౌలర్ గా శేఖర్, కొత్తగూడెం, యాక్టివ్ పార్టీని పెంట్ గా మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కలెక్టర్ అనుదీప్ ను నిర్వాహకులు ఎంపిక చేశారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు బహుకరించారు. ఈ కార్యక్రమాల్లో కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు సీతాలక్ష్మి, ఇల్లందు వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, నాగప్రసాద్, కౌన్సిలర్లు రూప, పద్మ, విజయ్, జమలయ్య, శ్రీనివాసరెడ్డి, పరమేష్ యాదవ్, ఇల్లందు కౌన్సిలర్లు సయ్యద్ అజాం, వాణి, నవీన్ కుమార్, శారద, తారా, పద్మావతి పద్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: