CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వనమాకు హెచ్చరిక

Share it:

 


తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం. శ్రీనివాస్


మన్యం మనుగడ, పినపాక:


 పినపాక నియోజకవర్గ ఆదివాసీ ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ను ప్రోటోకాల్ పాటించకుండా అంబేద్కర్ సాక్షిగా అవమానించినందుకు, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీరుపట్ల పినపాక మండల ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తొలి శ్రీనివాస్ మండిపడ్డారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదివాసి బిడ్డ అయ్యుండి, తెలంగాణ ప్రభుత్వ విప్ హోదాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జండా ఎగరవేయడం ఆదివాసులగా మేము గర్వపడుతున్న సమయంలో, వనమా వెంకటేశ్వరరావు ఆయన పుత్రుడు వనమా రాఘవ తీరు ఏ మాత్రం సరిగా లేదని, ఆదివాసులు అందలం ఎక్కితే తట్టుకోలేని స్థితిలో ఉన్నారని, పార్టీకి సంబంధించిన ప్లకార్డు లపై విప్ హోదాలో ఉన్న వ్యక్తి ఫోటోను ఉంచకపోవడం, ప్రోటోకాల్ ప్రకారము ఆహ్వానించకపోవడం తీరుపట్ల, వనమా వెంకటేశ్వరరావు ఓర్వలేనితనంని గుర్తు చేశారు. ఇప్పటినుండి అయిన తీరు మార్చుకోని హోదా ప్రకారం గౌరవించే దిశగా పయనించాలని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి స్వయంగా దరఖాస్తు అందిస్తామని అన్నారు. కొత్తగూడెం లో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు కొరకు దళిత గిరిజన సంఘాలు పోరాటంతోనే ఆవిష్కరణ జరిగిందని, అలాంటి ఆదివాసి బిడ్డకే అవమానం కలిగించడం, ఆదివాసి జాతి ఎన్నటికీ మరచి పోదని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సర్పంచ్ కోరం రజిని,పినపాక మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు జానంపేట సర్పంచ్ మహేష్, ఆదివాసి ఐక్యవేదిక కన్వీనర్ సోలం అశోక్, గొగ్గల కృష్ణ, ఆదివాసీ నాయకులు కుంజా కృష్ణ, బొగ్గం రమేష్, గుమ్మడి అశోక్, తెలంగాణ జెన్కో ఎస్టి ఎస్సి సెల్ సంఘ ప్రధాన కార్యదర్శి సిద్దెల హుస్సేన్, పినపాక మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గొంది నాగభూషణం, కోరం జంపయ్య, బాడిస విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: