CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలుగా జూనియర్ సీతక్క (వేముల భారతి)

Share it:

 


 తనను నమ్మి పగ్గాలు ఇచ్చిన దిశ ఫౌండర్ బి వెంకటేశ్వరరాజుకి కృతజ్ఞతలు తెలిపిన భారతి


 మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్ణణం వాస్తవ్యురాలు, ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వేముల భారతికి దిశ వర్గాలు హైకమాండ్ అప్పగించడంతో పేటలో చర్చనీయాంశంగా మారింది. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా ఆశ్వారావుపేటకు చెందిన ఎంపిటిసి-1 జూనియర్ సీతక్క వేముల భారతిని నియమించారు. ఈ మేరకు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బి వెంకటేశ్వర రాజు భారతికి నియామక పత్రాన్ని శనివారం హైదరాబాద్లో అందజేశారు. జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిన జాతీయ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్‌కు, దిశ ప్రొప్రొక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ బి వెంకటేశ్వరరాజుకి వేముల భారతి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జూనియర్ సీతక్క (వేముల భారతి) మాట్లాడుతూ ప్రతి మహిళా నిర్భయంగా అన్ని రంగాలల్లో రాణించిన్నప్పుడే స్త్రీకి నిజమైన స్వేచ్ఛ ఉన్నట్లని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఫిర్యాదు చేసేందుకు చాలామంది విద్యార్థినిలు, మహిళలు వెనుకడుగు వేస్తుండటం వల్లే ఈవ్ టీజర్స్ మరింత రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు ఎవరి నుంచి ఎదుర్కొన్నా సరే పోలీసులను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ఆడపిల్లలకు బతిక హక్కు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు కృషి చేస్తామన్నారు. బాల్య వివాహాలు జరగడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా తీసుకువచ్చిన దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. దానికి దిశ చట్టమే సంకేతమంటూ పోర్షం వ్యక్తం చేశారు. యావత్ భారతదేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన దిశ ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని అందరూ స్వాగతించారన్నారు. రాష్ట్రంలో మహిళలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుని కొత్త చట్టాన్ని తీసుకురావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. దిశ చట్టం దేశవ్యాప్తంగా మహిళలపై దాడులను అరికట్టి, మంచి పరిణామాలు తీసుకు రావడానికి కొంతమేర కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయన్నారు. చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దిశ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. దేశ చట్టం ద్వారా హత్య, లైంగిక దాడి, గృహ హింస వంటి హేయమైన నేరాలు కొద్దిమేర తగ్గుతాయన్నారు. ఈ చట్టం ద్వారా నేరాలకు పాల్పడే వారికి భయం కలిగి నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని కించపరిచేలా పోస్టులు పెట్టి సైబర్ నేరాలకు పాల్పడే వారికి అడ్డుకునేందుకు దిశ చట్టం దోహదపడుతుందని తెలిపారు. త్వరలో అలాంటి నేరాలకు తెరపడనుందని, మనం కూడా జూగ్రత్తగా ఉండాలని మగవారు అనుకునే పరిస్థితి రాకపోదని అశ్వారావుపేట ఎంవీటిని-1, సంఘ సేవకురాలు జూనియర్ సీతక్క (వేముల భారతి) అన్నారు. వేముల భారతి నియామకం పట్ల హర్షం... అశ్వారావుపేట -1 ఎంపిటిసి, సంఘ సేవకురాలైన జూనియర్ నీతక్క (వేముల భారతి) ని దిశ ఫౌండేషను భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలిగా నియమించడం పట్ల అశ్వారావుపేట ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు, స్వచ్చంద సంస్థల వారు, దిశ కమిటీ జిల్లా సభ్యులతో పాటు సభ్యురాలైన బోగిని స్వేతానాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇటు సంఘ సేవకురాలు ఆటు ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న భారతికి దిశకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం శుభ సూచికమన్నారు. భారతి చేస్తున్న సేవలకుగాను దిశ హైకమాండ్ గుర్తించి పదవి కట్టబెట్టడం సంతోషకరంగా ఉందన్నారు. సమస్యలతో వస్తున్న జనానికి భారతి సేవలు అందిస్తూ భవిష్యత్ లో మరిన్ని పదవులు అలంకరించాలని ఆంక్షించారు.

Share it:

Post A Comment: