CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్య పరిష్కారం చేయకుండా

Share it:

 


ఆదివాసులపైకి రాజకీయ పార్టీలను ,ఆదివాసి సంఘాలను రెచ్చగొడుతున్న రెవిన్యూ అధికారులు


ప్రత్యన్మాయ భూములున్న ఆదివాసుల పట్టా భూములగుంజుకునే కుట్ర.

సమస్యను పరిష్కారంచేయాలని కలెక్టర్ ఆదేశించినా జాయింట్ కలెక్టర్, ఎమ్మార్వో ఉద్దేశ పూర్వకంగానే భూములుగుంజుకుంటున్నారు.


 మన్యం టీవీ చర్ల: చర్ల మండలం విజయాకాలనీ లో ఉన్న పొడుభుముల సమస్యలను

సంవత్సరకాలంగా పరిష్కారంచేయటంలో విఫలమైన జిల్లా జాయింట్ కలెక్టర్ ,మండల రెవిన్యూ అధికారులు ఇప్పుడు విజయకాలనీ ఆదివాసులపైకి రాజకీయపార్టీలను, ఆదివాసి సంఘాలను యగదోసి గొడవలు సృష్టిస్తున్నారని ఇది సరైన చర్యకాదని దీనివలన జరిగే అనర్ధాలకు రెవిన్యూశాఖ బాద్యత వహించవలసి వుంటుందని సిపియం చర్లమండల కవిుటి పేర్కొన్నది.ఏకలవ్యపాఠశాలకి చర్లలో ప్రభుత్వ భూములున్నప్పటికి ఆదివాసుల పట్టాభూములను ఎందుకు తీసుకుంటున్నారనేదాని రెవిన్యూశాఖ సమాధానం చెప్పాలని సిపియం డిమాండ్ చేసింది.ఆదివాసుల పట్టా భూములకు ఎదురుగానే ప్రభుత్వ భూవిు వున్నప్పటికి దాన్ని కేటాయించకుండా పట్టాభూములు కేటాయింటం వెనుక తెరాస నాయకుల కుట్ర వుందని అనుమానం కలుగుతుందని అన్నారు. సంవత్సరం నుండి ఈసమస్యకు రేవిన్యూ అధికారులు ఎందుకు చూపటంలేదని సిపియం ప్రశ్నించింది. తాముతేసిన తప్పిలను కప్పిపుచ్చుకోవటం కోసం ఇప్పుడు రాజకీయ పార్టీలను ఆదివాసి సంఘాలను పట్టా భూములు కలిగిన ఆదివాసులపైకి గొడవలకి యగదోలుతున్నారు.వాస్తవాలను గ్రహించకుండా ఏకలవ్య పాఠశాలను సిపియం అడ్జుకుంటుందని ప్రచారం చేయటం అధికారులకు,రాజకీయపార్టీలకు,ఆదివాసి సంఘాలకి సరైంది కాదని సిపియం చూసించింది. ఆదివాసలకు లేదాఎకలవ్య పాఠశాలకు ఎవరికో ఒకరికి ప్రత్యన్మాయ భూములు చూపించాలని ఏడాదికాలంగా సిపియం అధికారులకు లిఖిత పూర్వకంగా చెప్పినా ఎందుకు స్పందించలేదని సిపియం ప్రశ్నించింది.పాఠాశాలకావాలని ఇప్పుడు ముందుకు వచ్చిన నాయకులకు ఆదివాసుకు జరుగుతున్న అన్యాయం పట్టదా? వీూ పట్టాభూములైతే అలాగే వదిలేస్తారా? అని సిపియం ప్రశ్నించింది.ఆదివాసలు పట్టాభూములలో ఏకలవ్యపాఠశాలకట్టి దాని ఎదురుగా వున్న ప్రభుత్వ భూవిుని కబ్జా చేయలని కొందరు రాజకీయనేతలు కుట్ర చేస్తున్నారని అందుకోసమే కక్షకట్టి విజయకాలని ఆదివాసుల భూములు గుంజు కోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.సిపియం పార్టీ ఏకలవ్య స్కూల్ కి ఏమాత్రం వ్యతిరేకం కాదని ఆదివాసు పట్టా భూములే తీసుకోవాలనుకుంటే వారికి మరోచోట భూవిుకేటాయించిన తరువాతనే పనులు ప్రారంభించాలని సిపియం కోరుతుందని.రేవిన్యూ అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే దుకు రాజకీయపార్టీలను ఆదివాసిసంఘాలను వాడుకుంటున్నారని.రాజకీయపార్టీలు,ఆదివాసిసంఘాలు,పునరాలోచన చేయాలని ఆదివాసుల కు న్యాయం జరిగేందుకు సహాకరించాలని సిపియం విజ్ఞప్తిచేసింది.

Share it:

Post A Comment: