CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గానుగపాడు సొసైటీలో ధాన్యం కొనుగోలు పై ఆర్డివో స్వర్ణలత విచారణ

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : గానుగపాడు సహకార సంఘం లో కొత్తగూడెం ఆర్డిఓ స్వర్ణలత విచారణ చేపట్టారు. సోమవారం సొసైటీ కార్యాలయంలో ఆమె రైతులతో సొసైటీ చైర్మన్ చెవులు చందర్రావు, సొసైటీ సీఈఓ లతో నేరుగా విచారణ చేపట్టారు. రైతుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సొసైటీలో పరిధిలోగల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తిప్పనపల్లి,పోకలగూడెం,తుంగారం,దామచర్ల, లో ఎంత మంది రైతుల వద్ద నుండి ఎన్ని క్వింటాలు ధాన్యం కొనుగోలు చేశారు, ఎంత మంది రైతుల వద్ద నుండి ఎంత ధాన్యం తరుగు కోత విధించారు అనే విషయాలు నేరుగా రైతుల వద్ద నుండి స్టేట్మెంట్ తీసుకుని తనకు పంపాలని తాసిల్దార్ ఉష శారదను ఆమె ఆదేశించారు. రైతుల వద్ద నుండి తరుగు పేరు కోతలు విధించారని రైతుల ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. విచారణలో ఆర్ఐ ముత్తయ్య, వీఆర్వో వెంకటేశ్వర్లు, ఈ ఓ సాయిభాను, తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: