CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంటు కై ఈ నెల 29 న శ్రీరాంపూర్ లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.

Share it:

 



 SCCWU.. IFTU మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి ఎండి.గౌస్.


 కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగం పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి ఎండి.గౌస్. కార్మికులను కోరారు మంగళవారం మణుగూరు రోడ్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, నిత్యం చట్టాలు, రాజ్యాంగం అంటూ నీతులు చెప్పే ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మిక వర్గం తమ రక్తతర్పణ తోటి సాధించుకున్న చట్టాలను, హక్కులను సౌకర్యాలను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి 44 చట్టాలను నాలుగు కోడులు గా విభజించి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి వేస్తుంది అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ది అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్మికవర్గం పై ఉందన్నారు. శ్రీరాంపూర్ లో జరిగే రాష్ట్ర సదస్సులో కార్మికవర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

           ఈ కార్యక్రమం లోవెంకన్న, ఎస్ ఎల్లమ్మ, బి ఎల్లమ్మ, సిహెచ్ నాగమణి, సత్యవతి, రమణ,రమణ కుమారి, రమాదేవి, నానమ్మ,అనసూర్య,సమ్మక్క, వరలక్ష్మి, సుందరం, నందిని ఫాతిమా తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: