CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి ఉద్యోగులకు 'సింగరేణి బంధు' పథకం ప్రకటించాలి.వీరమనేని రవీందర్ రావు కేంద్ర ఉపాధ్యక్షుడు B M S..

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

సింగరేణి ఉద్యోగులకు 'సింగరేణి బంధు' పథకం ప్రకటించాలని.వీరమనేని రవీందర్ రావు కేంద్ర ఉపాధ్యక్షుడు B M S..మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ సింగరేణి కార్మికులు సైనికులతో సమానమని బార్డర్ లో ఉన్నటువంటి సైనికులకు సింగరేణి కార్మికులకు ఒకటేనని అనేకసార్లు ప్రకటించారు.

ప్రకృతి విరుద్ధంగా సింగరేణి కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి బొగ్గు గనుల్లో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి, భారత దేశానికి విద్యుత్ కాంతులు అందిస్తున్నారు. అలాంటి సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

సింగరేణి ఉద్యోగులకు సొంత ఇల్లు లేక పదవి విరమణ పొందిన తర్వాత అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కావున సింగరేణి ఉద్యోగులందరికీ 'సింగరేణి బంధు' పథకం పేరుతో సింగరేణి విస్తరించి ఉన్నటువంటి ఆరు జిల్లాల కేంద్రాలలో 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. అదేవిధంగా కార్మికులు ఇల్లు కట్టుకోవడానికి 50 లక్షల ఆర్థిక సహకారం/ సౌకర్యం కల్పించి సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సాకారం చేయాలని ఈ సందర్భంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ డిమాండ్ చేస్తున్నది. 

---తెలంగాణ ఉద్యమంలో సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని అనేక ఉద్యమ సమయంలో మాట ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయిన కూడా ఈ రోజు వరకు సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడంలో కనీసం చొరవ చూపక పోవడమే కాకుండా కనీస సౌకర్యాలకు నోచుకోక పోవడం వేతనాలు చెల్లింపులో వ్యత్యాసాలు బోనస్లు చెల్లింపులో వ్యత్యాసాలు ప్రమాద వశాత్తూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడు మరణించినా గాయపడిన అనారోగ్యము పాలైన కుటుంబాలను సింగరేణి యాజమాన్యం పట్టించుకునే స్థితిలో లేనటువంటి పరిస్థితులను చక్కదిద్ద వలసిన అవసరం ఎంతైనా ముఖ్యమంత్రి గా ఉందని సింగరేణి కోల్ మైన్ కార్మిక సంఘ్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు వీరమనేని రవీందర్ రావు డిమాండ్ చేస్తున్నారు..

Share it:

Post A Comment: