CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెరాస జడ్పీటీసీ హామీలు మరిచినందుకే కాంగ్రెస్ లోకి చేరికలు

Share it:

 


*డబల్ బెడ్ రూమ్ హామీ ఏమైంది.

*జడ్పీటీసీ రాజీనామా చేయాలి.

*కాంగ్రెస్ పార్టీ డిమాండ్. 

మన్యం టీవీ ఏటూరు నాగారం

తెరాస జడ్పీటీసీ ఇచ్చిన హామీలు మరిచిపోయిందుకే తెరాస నుండి గత శనివారం తాడ్వాయి మండలం జడ్పీటీసీ గ్రామం అయినా కాల్వపల్లి నుండి 100 మంది తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ సిద్దబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసాఢపు మల్లయ్య, పురుషుత్తమ్ నర్సింలు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎన్నికల లో ఇచ్చిన హామీలు మరిచిపోయినదుకే శనివారం జాతీయ నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో 100 మంది తెరాస నాయకులు చేరడం తో తెరాస నాయకులు కొంతమంది ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. తాడ్వాయి జడ్పీటీసీ గెలిచినా తర్వాత ఇప్పటి వరకు చేసింది శూన్యం అని,ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అయినా మంజురు చేసారా అని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలు నెరవేర్చందుకు వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.ఒక్క గుంట పోడు భూమికి అయినా పట్టా ఇచ్చారా? అని నిలదీశారు,ఇప్పటి జడ్పీటీసీ ని ఎవరు లేరని పాపం అని కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ గా గెలిపిస్తే పదవి కోసం తెరాస లో చేరి ఇప్పటి వరకు ఏం చేసిందో ఆమెకే తెలియదు అని, కాల్వపల్లి గ్రామం లో 90 శాతం మంది కాంగ్రెస్ వాళ్లే అని,నాలుగు అయిగురు తెరాస అని ఉన్నారు అని త్వరలో వాళ్ళ ని కూడా కాంగ్రెస్ లో చేర్చుకుంటాం అని దమ్ముంటే చేతనైతే ఆపుకోండి అని సవాల్ విసిరారు..అనునిత్యం ప్రజల కోసం సేవ చేస్తున్న ఎమ్మెల్యే ని తెరాస వాళ్ళు విమర్శిస్తే ఉరుకోము అని, దేశం మొత్తం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ ల నాయకులు అన్ని వర్గాల నాయకులు ఎమ్మెల్యే సీతక్కని అభిమానిస్తుంటే కొంతమంది ముర్కులు ఓర్చుకోవడం లేదని ఆరోపించారు.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వ మే అని ఇంకా తెరాస అనేది కాల్వపల్లిలో లేదని, కాల్వపల్లి గ్రామానికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాకుండా జడ్పీటీసీ అడ్డుకుంటున్నది అని అన్నారు. కాల్వపల్లి గ్రామం లో సుమారుగా 400 ఇందిరమ్మ ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని,రోడ్లు వేసింది అంగన్వాడీ బడులు కట్టింది,హాస్టల్ కట్టింది, హాస్పిటల్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మే అని, కరెంట్ ఇచ్చింది, భూముల పంచి పట్టాలు ఇచ్చింది,చెరువులు కట్టింది,గ్రామానికి బ్రిడ్జ్ కట్టింది కూడా ఎమ్మెల్యే సీతక్క హయాంలో అని,పోడు భూముల కు పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మే అని,ఈ గ్రామం లో సుమారుగా 50 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మే అని,కాంగ్రెస్ ఏం చేసిందో మేము గర్వాంగా చెప్తున్నాం అని అన్నారు.జడ్పీటీసీ ఎన్నికలలలో మంత్రి దయాకర్ రావు జడ్పీటీసీ ని గెలిపిస్తే మండలం ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చి మళ్ళీ కనిపించడం లేదని,గోదావరి నీళ్లు వ్యవసాయంకు రైతులకు ఇస్తా అన్న హామీ జంపన్న వాగు వరద లో కొట్టుకపోయింది అని, ప్రజలు నీలాదీస్తారు అని భయపడి తెరాస ప్రజా ప్రతినిధులు రెండు సంవత్సరంల నుండి కనిపించడం లేదన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ యాలం శంకరయ్య,పుర్రి సమ్మయ్య,దుబాసి సుధాకర్ డబగట్ల నర్సింగరావు,ఓదెలు, పురుషోత్తం నారాయణ,బడే యాదగిరి, స్వామి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: