CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాండురంగపురంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి - డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల.

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ:-

పాల్వంచ మండలంలోని పాండురంగాపురంలో డెంగ్యూ వ్యాధితో అనేకమంది మృత్యువాత పడుతున్నారని, ప్రతి ఇంటికి ముగ్గురు,నలుగురు జ్వరపీడితులుగా ఉన్నారునీ, వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందించి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని *డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. సోమవారం పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగాపురం పుల్లాయగూడెం, రెడ్డిగూడెం ప్రభాత నగర్ గ్రామాలలో *కొత్వాల* విస్తృతంగా పర్యటించారు. పాండురంగాపురంలో డెంగ్యూ వ్యాధి ప్రభలిన విషయం తెలుసుకున్న *కొత్వాల* గ్రామాల్లో పర్యటించారు. డీఎంహెచ్వో శిరీష, డిప్యూటీ డిఎంహెచ్వో వినోద్ తో మాట్లాడారు. ఈ సందర్బంగా *కొత్వాల* వైద్యాధికారులతో మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం అందించాలని, మెడికల్ క్యాంప్ పెట్టి పరీక్షలు చేపట్టాలన్నారు. డెంగ్యూ వ్యాధి వలన ఇప్పటివరకు తేజావత్ రమేష్, షేక్ యపృద్దీన్, అన్నపరెడ్డి సుబ్బమ్మలు మరణించారని మండల వైస్ ఎంపీపీ మార్గం గురువయ్య డెంగ్యూతో బాధపడుతున్నారని, అధికారులు వైద్య సేవలతోపాటు పారిశుధ్య చర్యలు చేపట్టాలని *కొత్వాల* అన్నారు.


ఈ కార్యక్రమంలో *వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పూసల విశ్వనాథం, సర్పంచ్లు అజ్మీరా జగదీష్, గుగులోత్ పద్మ, సొసైటీ డైరెక్టర్ మైనేని వెంకటేశ్వర్రావు (బాబు), ఉపసర్పంచ్ జీవన్ రెడ్డి సోమా వెంకటరెడ్డి, వెంకటనారాయణ, పవన్* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: