CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ప్రశాంతంగా ముగిసిన సింగరేణి ఎగ్జామ్ - పరీక్ష కేంద్రాల వద్ద తీరుపై అసంతృప్తి

Share it:

 


*👉అందుబాటులో లేని మంచినీటి సౌకర్యం - కానరాని వైద్య శిబిరం - ఒకరు నిరసించిపోయి ఇబ్బంది పడిన అభ్యర్థి ఆమెకు వైద్య సదుపాయం కల్పించిన జిఎం ఆనందరావు* (భద్రాద్రి కొత్తగూడెం-మన్యం టీవీ): సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న 84 జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టర్లను ఎక్షర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయుటకు ఆదివారం నిర్వహించిన ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ ఏర్పాట్ల విషయంలో అభ్యర్థుల కొంత అసంతృప్తికి గురయ్యారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలలోని 18 పరీక్షా కేంద్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వ్రాత పరీక్షను నిర్వహించారు. జరుగుత్నున పరీక్ష తీరును సింగరేణి డైరెక్టర్ (పా)బలరాం, జిఎం పర్సనల్ అందెల ఆనందరావులు పరిశీలించారు. ఈ పరీక్షకు 11,140 మందికి హాల్ టికెట్స్ జారీచేయగా 7,666 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా కేంద్రాల వద్ద అత్యాధునిక మైన రాపిస్కాన్ మిషన్స్, హాండ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి అభ్యర్థులను క్షుణ్ణముగా పరిశీలించిన పిదప కంప్యూటర్లలోని హాల్ టికెట్లోని అభ్యర్థి వివరాలను గుర్తింపు కార్డ్ తో పోల్చి పరిశీలించిన తరువాత పరీక్ష హాల్ లోకి అనుమతించడం జరిగింది. ఈ వ్రాత పరీక్ష నిర్వహణ పూర్తిగా కంప్యూటర్ ద్వారా, మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా, నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా, సెక్యూరిటీ- విజిలెన్స్ వీడియో కెమెరాల నిఘా పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను సింగరేణి వెబ్ సైట్ www.scclmins.com. ద్వారా, హెడ్డాఫీస్ మెయిన్ గేట్ వద్దగల నోటీస్ బోర్డ్ లో పెట్టబడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్ష నిర్వహణ పరిశీలనలో జిఎం సెక్యూరిటీ కుమార్ రెడ్డి, విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్, ఎం ఎస్టేట్ వేంకటేశ్వరరెడ్డి, జిఎంఐఎ సుబ్బారావు, జిఎంసి అండ్ పిపి నాగభూషణ్ రెడ్డి, జిఎం హెల్తడి వెంకటేశ్వరరావు, గురవయ్య, దేవీ కుమార్ డైరెక్టర్ ఆపరేషన్స్, రామ్ కుమార్ జిఎంఐటి, దీక్షితులు ఎజిఎంపర్సనల్ ఆర్ సి తదితరులు ఉన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఎవరైన దళారులు అభ్యర్ధులను మోసం చేస్తున్నట్లు గమనిస్తే వాటి ఆధారాలతో కూడిన సమాచారాన్ని కంపెనీ ఉన్నతాధికారులకు గాని, విజిలెన్స్ అధికారులకు గాని, జిఎం పర్సనల్ ఆర్ సి-08744 242485 పోన్ ద్వారా తెలియజేసిన యెడల వెంటనే తగిన చర్యలు తీసుకొనబడతాయని అధికారులు తెలియజేశారు. వైద్య శిబిరం ఏదీ..? సింగరేణి ఎగ్జామ్ సందర్భంగా కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయకపోవడం పట్ల పరీక్ష హాజరైన అభ్యర్థులతో పాటు వారి వెంట వచ్చిన ప్రజలు విమర్శలు గుప్పించారు. గోదావరిఖని నుండి జర్నీ చేసి కొత్తగూడెంలో పరీక్షకు హాజరైన ఓ మహిళా అభ్యర్థి నిరసించిపోయి ఇబ్బంది పడింది. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ వారు ఆ అభ్యర్ధికి టిఫిన్ తో పాటు చాయ్ తీసుకొని వచ్చి అందించారు. ఈ వార్త జిఎం పర్సనల్ అందెల ఆనందరావుకు తెలియడంతో ఆయన ఇబ్బంది పడుతున్న అభ్యర్థివద్దకు వచ్చి వైద్యసదుపాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అందుబాటులో మంచినీటి సౌకర్యం లేదని పలువురు విచారం వ్యక్తం చేశారు. మరల జరగబోయే ఎగ్జామ్ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలని అభ్యర్థుల వెంట వచ్చిన సహయకులు పేర్కొన్నారు.

Share it:

Post A Comment: