CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద ఆడబిడ్డ పెళ్లి కానుక కల్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమనీ అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, శాదీముబారక్‌ చెక్కులను లబ్ది దారులకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సోమవారం వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చెక్కులను అందించేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ 2017 నుంచి ఎమ్మెల్యే గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈరోజు వరుకు 9,68,18,156/- కోట్లు శెంక్షన్ చేపిచ్చాం అని, ప్రభుత్వం పేదలను, ఎస్పీ ఎస్టీ మైనార్టీలను ఆదుకునేందుకు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.100116/- కళ్యాణలక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం అమలుచేసిన ప్రతి సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా చేరవేస్తున్న ఘనత కేసీఆర్ ది అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాస్త్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని అలాగే ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కి బ్రమ్మరధం పడుతున్నారు అని రేపు జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలలో కూడా అక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కే మద్దతు ఇస్తారని, ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిన్నంసెట్టీ వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపళ్లి శ్రీరామ్ మూర్తి, ఎంపీటీసీ వేముల భారతి, పేరాయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: