CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఓసి 2 ప్రమాద ఘటనలో మృత్యువాత పడిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం, కుటుంబం లో ఒకరికి డిపెండెంట్ ఉద్యోగ అవకాశం కల్పించాలి

Share it:

 


                   ---------------------------------------- మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ నేడు స్థానిక జియం ఆఫీస్ నందు ప్రత్యేక కమిటి తో జరిగిన సమావేశంలో  పలు సమస్యలను ప్రస్తావించి పరిష్కారం కోరిన మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు గారు                ---------------------------------------- మణుగూరు ఓసి 2 నందు జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అజ్మీరా బాష్యా, పర్స సాగర్, కాంట్రాక్టు కార్మికుడు వేల్పుల వెంకన్న కుటుంబాలకు మెరుగైన ఆర్ధిక ప్రయోజనం తో పాటు కుటుంబంలో ప్రతి ఒక్కరికి సింగరేణి ఉద్యోగ అవకాశం కల్పించాలని మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు గారు, టిబిజికేయస్ నాయకులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని  టిబిజికేయస్ చేసిన విజ్ఞప్తి మేర  సోమవారం నాడు స్థానిక ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ గారి అధ్యక్షత న గుర్తింపు కార్మిక సంఘము నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆనందరావు ,(జియం పర్సనల్ ఐ ఆర్ పియం) హాజరుకగా కార్పొరేట్ నుంచి ఎన్. వి రావు, హనుమంతరావు,స్థానిక అధికారులు డిజియం పర్సనల్ రమేష్, ఐ. ఈ డి వెంకట్రావు గారు సమావేశంలో పాల్గొన్నారు.మృతి చెందిన సింగరేణి కార్మికులతో పాటు ఔట్ సోర్సింగ్ కార్మికుడి కుటుంబానికి కూడా కోటి రూపాయల నష్ట పరిహారం అందించి మృతుల కుటుంబాల్లో ఒకరికి డిపెండెంట్ ఉద్యోగం కల్పించాలని కోరారు. మైన్ యాక్సిడెంట్ ద్వారా సింగరేణి కార్మికుడు చనిపోతే 15 లక్షలు ఎక్స్ గ్రేషియా,20 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్  అందించడం జరుగుతుందని కాంట్రాక్టు కార్మికులకు కూడా ఆ విధానం వర్తించే విదంగా చట్టం చేయాలని  కోరారు..అజ్మీరా బాష్యా, పర్స సాగర్ కుటుంబ సభ్యులకు  సూటబుల్ జాబ్ మణుగూరు ఏరియా నందు నెల రోజులలో అందించలన్నారు..సింగరేణి కార్మికులకు అందిస్తున్న ఎక్స్ గ్రేషియా లో మార్పులు చేయాలని ప్రస్తుతం అందిస్తున్న 15 లక్షల నుంచి 50 లక్షలకు పెంచాలని తెలిపారు. వర్క్ మెన్ కాంపెన్సెషన్ లెక్కించే విధానం ఆశాస్ట్రీయం గా ఉందని మెరుగైన కాంపెన్సెషన్ అందించే విదంగా చర్యలు చేపట్టాలని సూచించారు.పి. కె ఓసి నందు మెరుగైన రక్షణ చర్యలు చేపడుతూ ఉత్పత్తి, ఉత్పాదకత వెలికితీయలని రానున్న కాలంలో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని టిబిజికేయస్ తరుపున డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. మృతుల కుటుంబాలకు సరైన న్యాయం, దురదృష్టవశాత్తు రానున్న రోజుల్లో ఏదైనా ప్రమాదాలు జరిగి మృత్యువాత పడితే కార్మికుల కుటుంబాలకు అందించే ఆర్ధిక ప్రయోజనాలు పెంచాలని కోరుతూ టిబిజికేయస్ చేసిన ప్రతిపాదనలు డైరెక్టర్( పా) దృష్టికి తీసుకవెళ్లి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రత్యేక కమిటీ తెలిపినట్లు టిబిజికేయస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  లెవెన్ మెన్ కమిటి సభ్యులు సామ శ్రీనివాస రెడ్డి, కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, జియం కమిటీ సభ్యులు వీర భద్రయ్య, కోట శ్రీనివాసరావు, బాణోత్ కృష్ణ, సి. హెచ్ వెంకటేశ్వర రెడ్డి, ఏరియా అధికారులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: