CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నన్ను 4 సార్లు MLA గా ఎన్నుకున్న కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడిఉంటా.

Share it:

 


--- MLA వనమా వెంకటేశ్వరరావు.

    

మన్యం టీవీ పాల్వంచ:- తనపై నమ్మకముంచి తనను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను *కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో *వనమా* విస్తృతంగా పర్యటించి *1.25 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు* శంకుస్థాపన చేశారు. 27.50లక్షల వ్యయంతో రాహుల్ గాంధీ నగర్లో సిమెంట్ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణపనులకు,30 లక్షల వ్యయంతో స్థానిక C కాలనీ సెంటర్ వద్ద ఆటో స్టాండ్ నిర్మాణం, 16 లక్షల వ్యయంతో కాంట్రాక్ట్ కాలనీలో రోడ్లు,10.50 లక్షల వ్యయంతో నెహ్రూనగర్లో రాతిచెరువు వద్ద డ్రెయిన్ల నిర్మాణం, 41 లక్షల వ్యయంతో అయ్యప్పనగర్ నుండి పాత పాల్వంచ వరకు మెటల్ రోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా *వనమా* మాట్లాడుతూ తనపై నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎన్నటికి మరువనని, వారి సమస్యలపై నిత్యం శ్రమిస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను దశలవారీగా అమలు చేస్తున్నానన్నారు. అభివృద్ధిలో తానెప్పుడూ వెనుకంజ వేసేది లేదన్నారు.


*వనమాను ఘనంగా సత్కరించిన రాహుల్ గాంధీనగర్ మహిళలు.*

అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన *వనమా* కు ఆయా ప్రాంతాల ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. రాహుల్ గాంధీ నగర్ మహిళలు *వనమా* కు మంగళహారతులు పట్టారు. గజమాలతో, పట్టు శాలువాలతో *వనమా* ను సన్మానించారు.


ఈ కార్యక్రమంలో *టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్,ఏఇ రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి కుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామయ్య, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఇంజినీర్ రవి, ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ ఇందు టీఆర్ఎస్ పట్టణ,మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, మల్లెల శ్రీరామమూర్తి, ఎర్రంశెట్టి ముత్తయ్య, మహీపతి రామలింగం, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కనగాల నారాయణరావు, దాసరి నాగేశ్వరరావు, బండి లక్ష్మణ్, బండి చిన్నవెంకటేశ్వర్లు, చింతా.నాగరాజు, సాదం రామక్రిష్ణ హర్షవర్ధన్* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: