CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆత్మ నిర్బర్ భారత్ పథకంతో... అన్నదాతలకు మేలు.....

Share it:

 



 *మిర్చి రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు


 *తెలంగాణకు మిర్చి ల్యాబ్ సాధించి తీరుతా....


 *త్వరలో ములుగు జిల్లా మిర్చి రైతులకు తీపి కబురు....


 *జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి.

మన్యం టీవీ మంగపేట.


కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలుచేస్తున్న ఆత్మ నిర్బర్ భారత్ పథకంతో రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని అకినేపల్లి మల్లారం లో మిర్చి వ్యవసాయ క్షేత్రాలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ వీలైనంత త్వరగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ రైతులకు మిర్చి నాణ్యత ప్రమాణాల పెంపుపై మరియు పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులపై రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి అనుమతులు పొందినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి ఎగుమతిదారులు, బయ్యర్స్ సౌకర్యం కోసం వరంగల్ కేంద్రంగా విదేశాలకు మిర్చి ఎగుమతులను సులభతరం చేసేందుకు మిర్చి నాణ్యత ప్రమాణాలు పరీక్షలకోసం తప్పనిసరిగా మిర్చి లేబరేటరీని మంజూరు చేయించి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు పూర్తి చేసినట్లు సాంబశివ రెడ్డి తెలిపారు. జనవరి నాటికి ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని మిర్చి రైతులకు మంచి గిట్టుబాటు ధర రవాణా ఖర్చుల తగ్గింపు కోసం యఫ్. పి శాఖతో ఒక ప్రత్యేక వాణిజ్య కార్యక్రమాన్ని సి యఫ్ సి రూపొందిస్తున్నట్లు ఈ మేరకు త్వరలో ఐపీఎం మిర్చి రైతులకు తీపి కబురు చెబుతానన్నారు. ఇందుకు సంబంధించి తాను ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ పర్యటన చేసినట్లు వెల్లడించారు. సి ఎఫ్ సి మంజూరు కోసం స్థానిక ఎమ్మెల్యే సీతక్క మహబూబాబాద్ ఎంపీ కవిత తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మరియు నారాయన్ రాణే ల సహకారాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక రైతులు ధూళిపాల సుబ్బారావు మురళి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: