CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉హాకీ మన జాతీయక్రీడ కావడం అదృష్టం - జిల్లా స్పోర్ట్స్ అధికారి ఉదయ్ కుమార్.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు 29 (మన్యం టీవీ):- హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్.

హాకీ క్రీడా మన జాతీయ క్రీడ కావడం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం రోజున జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని జిల్లా స్పోర్ట్స్ అధికారి ఉదయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హోటల్ శ్రీ కృష్ణ ఇన్ లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి పాల్గొని ప్రసంగించారు. జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడను దాదాపు రాష్ట్రంలో మరిచిపోతున్న వేళ కోచ్ ఇమామ్ భద్రాద్రి కొత్తగూడెం అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని వందలాది మంది హాకీ క్రీడాకారులను తయారుచేయడం నిజంగా అదృష్టం అని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి జిల్లా లో మరీ ముఖ్యంగా కొత్తగూడెంలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని వారందరికీ శుభాభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కొత్తగూడెం క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాలని భద్రాద్రి జిల్లా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది ఆకాంక్షించారు అనంతరం క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లపోతు వాసు, ఉమ్మడి ఖమ్మం జిల్లా హాకీ సెక్రెటరీ బట్టు ప్రేమ్ కుమార్, కొత్తగూడెం హాకీ క్లబ్ అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్, సీనియర్ కోచ్ సలీం, జిల్లా హాకీ కోచ్ ఇమామ్, స్పోర్ట్స్ ఆఫీసర్ లక్ష్మణ్ సీనియర్ క్రీడాకారులు నిఖిల్ ,సర్వేష్ గణేష్, మరియు ఇతర హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: