CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సుగంధ పంటల సాగు కి సాయం అందించండి...

Share it:

 



 *కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీ విజ్ఞప్తి..


 *జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యం టీవీ మంగపేట.


దేశవ్యాప్తంగా సుగంధ పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి స్పైసెస్ బోర్డ్ ద్వారా సాయం అందించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో భాగంగా వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా సాంబశివ రెడ్డి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాబినెట్ హోదా లో పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి తొలిసారిగా వరంగల్ కు వచ్చిన నేపథ్యంలో సాంబశివ రెడ్డి వ్యవసాయరంగానికి చిహ్నమైన నాగలి బహూకరించి సుగంధ రైతుల సమస్యలపై లేఖను అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సుగంధ పంటలుగా మిర్చి పసుపు పంటను సాగు చేస్తున్నారని ఈ రైతాంగానికి రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు సాగు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే పథకాలు అమలు చేయాలని తద్వారా మార్కెట్లో మిర్చి పంటకు మంచి ధర వచ్చేలా ప్రయత్నించాలని కోరారు మిర్చి రైతులకు ఐ పీ ఎమ్ కిట్లు ఉచితంగా అందజేయాలని సేంద్రియ సాగు ని ప్రోత్సహించాలని గ్రామీణ ప్రాంతాల్లో స్టోరేజ్ గోదాములు నిర్మించాలని ముఖ్యంగా మిర్చి పసుపు రైతులకు టార్పాలిన్ సీట్లు శిల్పాలిన్ సీట్లు సబ్సిడీపై మంజూరు చేయాలని కోరారు ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ అందించిన నివేదికలను రాయితీ పథకాల అమలును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సాంబశివారెడ్డి మంత్రినీ కోరారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. *నాగలి ని చూసి ముచ్చట పడ్డ మంత్రి కిషన్ రెడ్డి..* సాంబశివారెడ్డి వ్యవసాయరంగానికి చిహ్నమైన నాగలినీ బహూకరించడం తో ముచ్చట పడ్డ కిషన్ రెడ్డి బాగుందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రాకేష్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి.భాస్కర్ రెడ్డి నాయకులు రాజు నాయక్ కృష్ణవేణి బీజేవైఎం నాయకుడు గాలి. వేణు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: