CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజుపేటను నూతన మండల కేంద్రం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మండలంలోని రాజుపేట ను కేంద్రoగా నూతనంగా మండలం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీఏజీఎస్ మంగపేట మండల నాయకులు కొమరం సందీప్ మాట్లాడుతూ రాజుపేట లో ఇంటింటి సర్వే చేస్తూ మంగపేట మండలంలో 25 గ్రామపంచాయతీ లు 23 రెవెన్యూ గ్రామాలు,22 శివారు పల్లెలు,మొత్తం 50 అవాస ప్రాంతాలు ఉన్నందున మంగపేట మండల కేంద్రానికి వెళ్లాలంటే రాజుపేట ఏరియాలోని జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ని శివారు గ్రామాల ప్రజలు ఎంతోవ్యయ,ప్రయాసాలకు గురికావలసిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన,ఆందోళన వ్యక్తంచేశారు.అలాగే మండల కేంద్రానికి అకినేపల్లి మల్లారం,ఎస్టీ కాలనీ, ధోమెడ,కత్తిగూడెం, బండారుగూడెం,చింతకుoట,తదితర గ్రామాల ప్రజలు 30 నుంచి 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ దూరాబారంగా ఉన్న ప్రాంతాల్లో ని పది గ్రామాలకు రాజుపేట గ్రామం మధ్యస్థంగా ఉందని,అలాగే ఇప్పటికే వ్యాపారకేంద్రం గా అభివృద్ధి చెందిన గ్రామo గా ఉందని ఆయన తెలిపారు.అకినేపల్లిమల్లారం గ్రామం నుంచి చుంచుపల్లి వరకు ఉన్న12 గ్రామపంచాయతీలు,10 రెవెన్యూ గ్రామాలు,22 శివారు గ్రామాలు,25 ఆవాసప్రాoతాలను కలుపుకుని రాజుపేటను నూతన మండల కేంద్రం చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేనియెడల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కేశవరావు, నవీన్, ప్రశాంత్

గ్రామస్తులు మహీన్ కుమార్, నాగేంద్రబాబు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: