గుండాల ఆగస్ట్ 11 (మన్యం మనుగడ) మేకల పంపకంలో మెలుకువలు ఎంతో అవసరమని గుండాల వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ అన్నారు. బుధవారం మండలం పరిధిలోని ముతపురం గ్రామంలో ఎంపీపీ సత్యం తో కలిసి మేకలకు నట్టల మందు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలాల్లో బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో ఉన్న మేకలకు , గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రైతులు తప్పకుండా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, మరియు రైతులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: