CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లా వెనుకబడిన జిల్లాగా ప్రత్యేక హోదా కల్పించాలి....

Share it:

 


 పారిశ్రామిక ప్రత్యేక రాయితీలు కల్పించాలి.... 


 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి....


కేంద్ర ప్రభుత్వం  ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్ ప్రకటించి అమలు జరుపుతున్న వెనుకబడిన జిల్లాల జాబితాలో ములుగు జిల్లాను చేర్చాలని మరియు పారిశ్రామికీకరణకు ప్రత్యేక హోదా కల్పించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాశి రెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు బుధవారం స్థానిక వికాస్ ఆగ్రి ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రంగారెడ్డి జిల్లా మినహా మిగిలిన అన్ని పాత జిల్లాలు వెనుకబడిన జిల్లాలు గా ప్రత్యేక హోదా కల్పించారని ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా నీతిఆయోగ్ ఎంపిక చేసిందన్నారు. కాగా ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి కొత్తగా ములుగు జిల్లా ఏర్పాటు చేశారని, కానీ నీతిఅయోగ్ గెజిట్ లో  కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాను చేర్చలేదన్నారు. ఫలితంగా ములుగు జిల్లా లో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి అయోగ్ ప్రణాళికా సంఘం ములుగు జిల్లా వెనుకబడిన జిల్లాగా గుర్తించి ప్రత్యేక హోదా కల్పిస్తే జిల్లాలో కొత్తగా పారిశ్రామిక అభివృద్ధి మెండుగా జరుగుతుందని అదేవిధంగా వ్యాపారులకు పన్ను ప్రోత్సాహకాలు లభిస్తాయని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. ములుగు జిల్లా దట్టమైన అటవీ ప్రాంతం తో  కూడుకుని చాలా గ్రామాల్లో నేటికీ కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు జిల్లాలో ఎక్కువగా గిరిజన హరిజనులు జనాభా ఉందని అదేవిధంగా ప్రభుత్వ రికార్డుల్లో తీవ్రవాద ప్రాబల్యం ఉన్న జిల్లాగా నమోదైందన్నారు ఈ నేపథ్యంలో ములుగు జిల్లా  కేంద్ర ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ వెనుకబడిన జిల్లాగా గుర్తించి ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు విద్యా వైద్యం కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో తాను త్వరలోనే కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులను కలవనున్నట్లు తెలిపారు. స్థానిక శాసన సభ్యురాలు పార్లమెంటు సభ్యురాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంత్రులు గట్టి ప్రయత్నం చేసి ప్రత్యేక హోదా సాధించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: