CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు కామ్రేడ్ లింగన్న!

Share it:


 

మన్యం మనుగడ, పినపాక:

ఆదివాసీ ముద్దుబిడ్డ విప్లవోద్యమ చరిత్రలో పోరుకెరటం పోడుభూముల రక్షణకై పోరు సలుపుతూ భూమి , భుక్తి , ఈదేశ విముక్తి కోసం , ఈ సమాజ మార్పు కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ప్రతిఘటన పోరాటయోధుడు కామ్రేడ్ పూనెo లింగన్నఅని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి కొనియాడారు.

ఈరోజు పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డులో మలికంటి రాము అధ్యక్షతన జరిగిన లింగన్న మూడవ వర్ధంతి సభలో మోర రవి మాట్లాడుతూ కామ్రేడ్ లింగన్న గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామంలో పూనెoలక్ష్మయ్య, పాపమ్మ దంపతులకు ముగ్గురు సంతానంలో పెద్దవాడిగా జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు బాల్యంనుండే సామాజిక స్పృహ ప్రగతిశీల భావాలు కలిగి స్థానిక సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండేవాడు ప్రాథమిక విద్యను ఆశ్రమ పాఠశాలలో, ఉన్నత విద్యను విప్లవంలో నేర్చుకున్నాడు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ విప్లవ రాజకీయాలను వదలకుండా నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఎన్ని నిర్బంధాలు వచ్చిన నిర్భయంగా ఎదుర్కొని తన 30 ఏళ్ల విప్లవ రాజకీయ జీవితంలో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా పార్టీ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రీజినల్ కమిటీ కార్యదర్శిగా ఏదిగాడన్నారు.

ఏజెన్సీలో పోడు భూముల రక్షణ కోసం ఉద్యమాలు నిర్మించాడని అటవీ సంపద , ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి వ్యతిరేకంగా, సింగరేణి ఓపెన్ కాస్ట్ లు తీయడానికి పాలకులు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించి అడ్డుకోగలిగాడు అందుకే లింగన్న ను 2019 జూలై 31న ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారని అన్నారు.ఈ సమాజంలో అసమానతలను , దోపిడి, దౌర్జన్యాలను చూసి చలించి పోయి వర్గ దోపిడీ వ్యవస్థ కూల్చకుండా మారదని నమ్మి పిడికిలి బిగించి పోరాడిన లింగన్న నాగేటి సాల్లల్లో రక్తం ధారపోసి విప్లవోద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచాడని ఆ యోధుని మరణం ప్రతిఘటన పోరాటాల కొనసాగింపులో భాగమని అన్నారు.

లింగన్న ఆశయాలను నిర్వర్తించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక జగ్గన్న ,మలికంటి రాము, నిట్ట అచ్చయ్య , మైపా రాంబాబు, సూరమ్మ , అలివేలు , చిన్న రాంబాబు , వీరాచారి , బి గురువారెడ్డి , లక్ష్మి , సత్యనారాయణ, రవి,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: