CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆగస్టు 19 వరల్డ్ ఫొటోగ్రఫీ డే.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19, (మన్యం మీడియా)

చిరంజీవి చింతల, ఫోటోగ్రఫీ డే ప్రత్యేక కథనం : ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం ఒక్క ఫొటోగ్రఫీకి ఉంది. ఈ ఆధునిక కాలంలో మానవజీవితంతో ఫొటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫొటోగ్రఫీకి శతాబ్ధాల చరిత్ర ఉంది. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. *రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ.* ఫోటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం అని అర్ధం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చిత్రాన్ని గీయడం. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుపు తెలుపులతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది.

*ఫొటోగ్రఫీ ప్రాసెస్ కనుగొన్నదెవరో తెలుసా.* ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ జె.ఎం.డాగ్యూరే అనే వ్యక్తి 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్ ను కనుగొన్నారు. 1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ఈ ఫొటోగ్రఫీ ప్రాసెస్ ను అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు..

*ప్రస్తుతం సెల్ఫీల హల్ చల్.* బ్లాక్ అండ్ వైట్ తో మొదలైన ఫొటోల ప్రస్థానం ప్రస్తుతం సెల్ఫీలతో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలో సుమారు 80 శాతం మంది ప్రజలు సెల్ఫీలపై తెగ మోజు చూపుతున్నారు. ఇక మన దేశంలో సెల్ఫీల కోసం ఏవేవో ఫీట్లు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది సెల్ఫీలను తీసుకుని ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పెట్టి అందరి చేత మన్ననలు పొందుతున్నారు. మరి కొందరైతే సెల్ఫీలను తీసుకుని ప్రతి ఫొటోని షేర్ చేస్తున్నారు. ఇంకొందరికైతే సెల్ఫీల పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. సో ఫొటోలకు ఇప్పటికీ ఎంత డిమాండ్ ఉందో ఇప్పటికే చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. సో మీరు కూడా ఈరోజు ఒక ఫొటో తీసుకుని హ్యాపీ ఫొటోగ్రఫీ డే విషెస్ ను షేర్ చేసుకోండి.

Share it:

Post A Comment: