CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా మదర్ థెరిసా 111వ జయంతి వేడుకలు

Share it:

 


*మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 111వ జయంతి సందర్భముగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అల్బేనియాలో జన్మించిన భారత పౌరసత్వం పొందిన రోమన్ కేథెలిక్ సెయింట్

'మదర్ థెరీసా' ఆగష్టు 26,1910లో జన్మించారని. మదర్ థెరిస్సా ఆగ్నీస్ గోక్షా బొజాక్షుగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కలకత్తాలో 1950 లో స్థాపించారు.ఆమె 45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో,ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు,రోగగ్రస్తులకూ, అనాథలకూ,మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేశారని ని.యావత్తు ప్రపంచాన్ని భయపెడుతున్న కుష్టు రోగ గ్రస్థులకు కూడా ఆమె సపర్యలు చేశారని.అలాగే వారు చేసిన సేవలను కొనియాడుతూ"సేవే మార్గం ప్రేమే లక్ష్యం"గా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సాటి మనిషికి సేవ చేయాలని వారి జయంతి సందర్భముగా వారికి ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూచన రవళి రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్,జిల్లా ఎస్.సి సెల్ అధ్యక్షులు దాసరి సుధాకర్,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి,మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి. ఆయుబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా,ములుగు ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి,మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,ఏటూరునాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, వివిధ మండలాల అనుబంధ సంఘాల జిల్లా మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: