CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమాత్యులరా మా సమస్యను అలకించరా

Share it:

 


👉నిధులున్న అనుమతులు సున్న

 👉గుండాల- రంగాపురం ,

 మర్కోడు  - కరకగూడెం                                        నిధులు మంజూరు అయిన  అటవీశాఖ అనుమతి  లేక  మధ్యలోనే ఆగిపోయిన రహదారులు  

👉 ఆశలన్నీ వారిపైనే

👉శనివారం గుండాల లో పర్యటించనున్న మంత్రులు పువ్వడా,ఎర్రబెల్లి,విప్ రేగా

✍️గడ్డం వీరన్న,మన్యం మనుగడ ప్రతినిధి,గుండాల

 గుండాల జూలై 9( మన్యం మనుగడ)  నిధులున్న అనుమతులు సున్న. గుండాల  ఆళ్ల పల్లి మండలాల్లో రహదారుల దుస్థితి  ఇది. ప్రభుత్వం రహదారులకు నిధులు మంజూరు చేసినప్పటికీ అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో రహదారులు మధ్యలోనే నిలిచి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ మండలాలైన గుండాల  ఆళ్ల పల్లి మండలాలకు రహదారుల నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసింది .ఈ రహదారులు కొంతమేర పూర్తయినప్పటికీ అటవీశాఖ పరిధిలో ఉన్న రహదారి పనులకు ఆ శాఖ అధికారులు అభ్యంతరాలు తెలపడంతో  ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుండాల నుండి రంగాపురం రహదారి ,వెంకటాపురం గ్రామం నుండి రంగాపురం వరకు ఎటువంటి పనులు జరగకుండానే నిలిచిపోయాయి. మర్కోడు గ్రామం నుండి కరకగూడెం వెళ్లే రహదారి కి కూడా నిధులు మంజూరు అయిన అటవీశాఖ అభ్యంతరాలు తెలపడంతో అక్కడ కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. దేవుడు కరుణించిన పూజారి వర వెయ్యని సందర్భంగా ఈ రెండు మండలాల్లోని రహదారుల  దుస్థితి. శనివారం ఈ రెండు మండలాల్లో  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించనున్నారు. వీరు ఐనా అటవీశాఖ అధికారులతో చర్చించి రహదారులు పూర్తి  అయ్యేవిధంగా చొరవ చూపాలని రెండు మండలాల ప్రజలు వేడుకుంటున్నారు

Share it:

TELANGANA

Post A Comment: