CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రాణవాయువుకు ఊపిరి ఊదుదాం......

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి


 తన మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా వంద మొక్కలతో హరితహారం....

మన్యం టీవీ మంగపేట.

ప్రాణవాయువు కి ఊపిరి ఊదెందుకు మొక్కలు నాటి చెట్లను పెంచాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో తన మాతృమూర్తి నాశిరెడ్డి చిట్టెమ్మ నాలుగో వర్ధంతి సందర్భంగా వికాస్అగ్రి ఫౌండేషన్ కార్యాలయం ప్రాంగణంలో వంద మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాంబశివ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం అడవుల నరికివేత ఎక్కువ కావడం చేత చెట్ల సాంద్రత తగ్గిపోయి ప్రాణవాయువు ఆక్సిజన్ ఆశించినంత లభించక ప్రస్తుత కొవిడ్ సీజన్లో ఆక్సిజన్ పంపిణీ సక్రమంగా జరగక ఎంత ప్రాణ నష్టం జరిగిందో ప్రతి పౌరుడు ఒక సారి గుర్తు చేసుకోవాలన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెళ్లిరోజు జయంతి వర్ధంతి మరియు ఇతర ముఖ్య సందర్భాలలో తప్పనిసరిగా మొక్కలు నాటి పెంచాలని విజ్ఞప్తి చేశారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని సాకారం చేసే దిశగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తమ జన్మహక్కు గా భావించి మొక్కలు విరివిగా నాటాలని కోరారు. మనిషి జీవితంతో అనేక రకాలుగా మమేకమైన మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు చక్కని ప్రకృతి సంపదను ఇచ్చేందుకు భాగస్వాములు కావాలని ఆయన అన్నారు త్వరలోనే అకినేపల్లి మల్లారం గ్రామంలో గోదావరి నది తీరాన నూతనంగా నిర్మించిన వైకుంఠధామం లో నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాశిరెడ్డి నాగిరెడ్డి కటుకూరి శేషయ్య వికాస్ అగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు వికాస్ రెడ్డి వివేకానంద రెడ్డి సమ్మిరెడ్డి మాధవ రెడ్డి దరణిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: