CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత కళాకారులకు పింఛన్ ఇవ్వాలి

Share it:

 


*మన్యం టీవీ ఏటూరు నాగారం

రాష్ట్రంలో చెప్పులు కుట్టే వృత్తిదారులకు,డప్పు కొట్టే దళిత కళాకారులకు రూ.5,000 వేల పింఛన్‌ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఏటూరునాగారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ములుగు జిల్లా అధ్యక్షుడు కావిరి అర్జున్ మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో దళితులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు.తెలంగాణ నమూనా – నాణేనికి మరోవైపులా ఉంది అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే మొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని, లేకపోతే తల నరుక్కుంటానని చెప్పిన తెరాస పార్టీ అధినేత తన మాట తప్పి దళితులను మాయ చేశారు. దళితులపైన ఈ వివక్ష వారికి సంబంధించిన హామీలు పథకాలలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.

అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమం ముసుగులో కొత్త రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం తనదైన రీతిలో వనరుల దోపిడి,హక్కుల ఉల్లంఘన, వ్యవస్థల విధ్వంసాలకు పాల్పడింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం అందుకున్న ముఖ్యమంత్రి రాజ్యాంగ నైతికతను మాత్రం వెయ్యి అడుగుల లోతులో బొంద పెట్టారని అన్నారు. మానిఫెస్టోల్లోని హామీలను అమలు చేయకపోవడమేగాక, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పాలన చేయడం ద్వారా రాజ్యాంగ పరంగా అనైతికతకు కూడా పాల్పడుతున్నారు.ముఖ్యంగా మిగులు బడ్జెట్ కలిగిన అత్యంత సంపన్న రాష్ట్రమని చెప్పుకుని ఆ సంపద పంపిణీ మాత్రం సముచితంగా, అసమానతలు రూపుమాపే విధంగా చేయలేదు.ఈ ప్రభుత్వ హయాం లో సమాజంలోని అత్యంత బలహీనులైన,వెనుకకు నెట్టివేయబడిన వర్గాలు ముఖ్యంగా దళితులకు ప్రతీ సారి ఏదో ఒక పేరు పెట్టి అన్నీ ఇస్తామని చెప్పి ఏది అందించకుండా వారిని మోసం చేస్తూనే ఉంది. దళిత ప్రజలను మరియు దళిత మేధావులను తన రాజకీయ ఓటు బ్యాంకు కోసం వాడుకుంటూ....!యావత్ దళిత జాతిని మోసం చేస్తున్న ఈ అధికార పార్టీ వారు చేసిన మోసాల చిట్టా చెప్పుకుంటే పోతే....?

*దళిత ముఖ్య మంత్రి

*దళితులకు మూడు ఎకరాల భూమి

*డప్పు కు చెప్పు కుట్టు కు పింఛను

*దళితుల పై దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.

రాష్ట్రంలోని దళిత కుటుంబాలందరికీ మూడెకరాల సాగుయోగ్యమైన భూమి అందిస్తామని చెప్పి, ఏడెళ్ళలో ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 

స్థూలంగా సమాజంలో అత్యంత వెనుకబడ్డ, అణచబడ్డ వర్గాలను అన్ని రకాలుగా మోసగించే విధానాన్నే ఈ ప్రభుత్వ ఆధ్యర్యంలోని ప్రభుత్వం గత ఏడేళ్లుగా ఆచరిస్తుంది.అది బట్టబయలు కాకుండా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధిలో,సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందనే అబద్ధపు ప్రచారాన్ని చేపట్టింది.ప్రభుత్వంలోని ఈ డొల్లతనాన్ని,అనైతికతను తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారని అన్నారు.దళిత సాధికారత పేరుతో కొత్త పథకం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం అదే విధంగా దళిత కళాకారులకు, చెప్పులు కట్టుకునే వృత్తి దారులకు కూడా నెలకు 5,000 రూపాయల పింఛను అందించే ప్రక్రియ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మీకు తెలియజేస్తూ,మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గద్ధల రఘుబాబు, ఏటూరునాగారం మండల అధ్యక్షుడు గండేపల్లి సత్యం, జిల్లా కార్యదర్సులు బొల్లే శ్వామియల్,జాడి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి 

ఈక మహాలక్ష్మి,జిల్లా కార్యదర్శి బసాని సుగుణ,కావిరి నారాయణ,మహిళా మోర్చా అధ్యక్షులు పలక గంగ,కంకణాల నిర్మల, నాగమణి,ప్రేమలత,భవాని బిజెవైఎం నాయకులు గద్ధల ప్రణయ్,సాయిని మల్లి కార్జున్,బుర్రి కిరణ్ కుమార్,మనుబోతుల మనోహర్,కుక్కల శంకర్, డప్పు కళాకారులు వావిలాల విజయ్,బాబు,ముత్తయ్య,సమ్మాయ,రమేష్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: