CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చారిత్రక కట్టడం రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం హర్షణీయం....

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యంటీవీ మంగపేట.


కాకతీయుల అద్భుత కళా ఖండం పురావస్తు ప్రాచీన కట్టడం రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు రావడం హర్షనీయమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితంగా నేడు ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప యునెస్కో ఎంపిక చేయటం హర్షించదగ్గ విషయమన్నారు రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి రావడంపట్ల ఈ ప్రాంతవాసిగా తాను ఎంతో గర్వపడుతున్న ట్లు తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం కృషిచేసిన కేంద్ర ప్రభుత్వానికి సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా యునెస్కో స్థాయి శోభను అలంకరించే విధంగా  అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సాంబశివ రెడ్డి కోరారు. ఈ మేరకు త్వరలోనే కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి లేక అందజేయనున్నట్లు తెలిపారు.

Share it:

Post A Comment: