CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా

Share it:


జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోశించాలన్నారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని, రాష్ట్రంలోని ప్రతీ డాక్టరుకు సీఎం పిలుపునిచ్చారు. 


తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని, బాధలనుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని సీఎం అన్నారు. కరోనా సహా అన్ని ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవన్నారు. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కునే క్రమంలో తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టరునూ, వారికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులను, పేరు పేరునా మరోసారి అభినందిస్తున్నానని సీఎం అన్నారు.


రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇప్పటికే పలు వైద్య కళాశాలలను ప్రభుత్వం నెలకొల్పిందన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: