CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్ని గ్రామాలకు సరుకులు తీసుకెళ్ళరా

Share it:

 


 ఎక్కడపడితే అక్కడ సరుకులను ఇస్తున్న గుత్తేదారు

  నడిరోడ్డుపై సరుకుల పంపిణీ

 వాటిని తీసుకెళ్లేందుకు నానా తంటాలు పడుతున్న సిబ్బంది

 గుండాల జూలై 16 (మన్యం మనుగడ) అన్ని గ్రామాలకు సరుకులను తీసుకెళ్లకుండా ఎక్కడపడితే అక్కడ రోడ్ల మీదే అందజేస్తున్న గుత్తేదారు. శుక్రవారం మండలానికి కోడిగుడ్ల వాహనం వచ్చింది కానీ చెట్టు పెళ్లి ఏరియా కు చెందిన వారందరిని స్థానిక పెట్రోల్ బంకు వద్దకు పిలిచి పంపిణీ చేశారు. వాటిని తీసుకెళ్లడానికి సిబ్బంది నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రహదారులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది కానీ గత సంవత్సరం నుండి అన్ని గ్రామాలకు రహదారులు పూర్తయిన వారు మాత్రం పాత తంతు నే వ్యవహరిస్తున్నారు. మండలంలోని కొన్ని అంగన్ వాడి కేంద్రాలు సరుకులు ఉన్న సరుకులు ఉన్న వారికి పంపిణీ చేయకుండా వృధా చేస్తున్నారు. నియంత్రించాల్సిన సూపర్వైజర్లు నెల కుమారి కూడా మండలం చూడకపోవడంతో వారి వారి ఇష్టం వచ్చిన రీతిలో ఇస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఐసిడిఎస్ అధికారులు చర్యలు చేపట్టాలని గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి సరుకుల వాహనం వెళ్లే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు

Share it:

TELANGANA

Post A Comment: