CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిననాగరాజు ఆశయాల సాధనకు ఘన నివాళి సీపీఎం చర్ల

Share it:

 మన్యం టీవీ చర్ల : మార్క్సిష్టు జెండా అండతోనే పేదలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని నమ్మి తుదిశ్వాస వరకు సీపీఎం పార్టీ పక్షాన ప్రజాపోరాటాలు నిర్వహించిన తడికల చిననాగరాజు ఆశయాలను సాధించడమే మార్క్సిష్టు కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఇచ్చే ఘననివాళి అని సీపీఎం చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ అన్నారు. చర్ల బిఎస్‌రామయ్య భవన్‌లో జరిగిన చిననాగరాజు 19వ వర్థంతి సభలో చరణ్ ప్రసంగించారు. పేదల పక్షపాతిగా, బడుగు బలహీనవర్గాల సమస్యల పరిష్కారం కోసం చిననాగరాజు నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన మార్క్సిష్టు కార్యకర్త అన్నారు. అభ్యుదయ భావాలతో తన మధురమైన గళం ద్వారా ఎందరికో ఉత్సాహం కలిగించేవారని అన్నారు

ఆయన ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని, అదే ఆయనకు ఇచ్చే ఘననివాళి అన్నారు. ఈ వర్థంతి సభలో పార్టీ మండల కమిటీ సభ్యులు అలవాల రాజమ్మ చింతూరు రజనీకాంత్ కెవిపిఎస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు ప్రజానాట్యమండల కార్యదర్శి కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బందెల చంటి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు శ్యామల వెంకట్ మహిళా సంఘం నాయకురాలు వరదల వరలక్ష్మి పార్టీ సభ్యులు పలక సూరమ్మ బాయమ్మ చింతకాయల నాగమణి డబ్బుల కొండా దుర్గ భవాని మా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: