CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉వెంకటయ్య ఆధ్వర్యంలో ఉచితంగా కరోనా మందు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 18:- కరోనా సోకిన తర్వాత లక్షలు,లక్షలు గుమ్మరించి బాగు చేయించుకునే దానికంటే రాకుండా,నమ్మకంతో ఆయుర్వేద మందును ఆశ్రయించడం మేలని మొక్కల వెంకటయ్య అన్నారు. ఆదివారం రామవరం అంబేద్కర్ భవన్లో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆనందయ్య ఫార్ములాతో, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, కష్టనష్టాలకు ఓర్చి వేలమందికి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆయుర్వేదిక అనువంశిక వైద్యులు రామంచి శ్రీనివాస్ కృషి ఎనలేనిదని కొనియాడారు. నమ్మకంతో, ప్రివెంటివ్ గా ఒక మూడు రోజులు వాడుకుంటే కరోనా మన దరిచేరదన్నారు. వచ్చిన వాళ్లు సైతం ఈ మందు వాడితే అద్భుతమైన రిజల్ట్ వారి సొంతం అవుతుంది అని తెలియజేశారు. పాతకొత్తగూడెంలో సైతం మల్లేష్ గురూజీ ఆధ్వర్యంలో వేలాది మందికి అందించమన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో లో కాపు కృష్ణ, కంచర్ల జమలయ్య, మునిగడప వెంకటేశ్వర్లు లు మాట్లాడుతూ, కరోనా మందు తీసుకోవడం మూలంగా ఎంతోమంది కరోనా ను ఎదిరించి, ఆరోగ్యవంతులు అయ్యారని తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మొక్కల వెంకటయ్య, మందు తయారీదారు రామంచి శ్రీనివాస్ లను ఘనంగా శాలువాతో సత్కరించి, సన్మానించారు. అనంతరం 500 మందికి కరోనా మందు ని ఉచితంగా పంపిణీ చేశారు. మొక్కల రాజశేఖర్ మొక్కల్ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా తిప్పతీగ తో చేసిన కషాయాన్ని అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమానికి కొయ్యడ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, కూరగాయల శ్రీనివాస్, సంజీవరావు, మదనయ్య, సమ్మయ్య, ముస్తఫా, కిలారు హరిప్రసాద్, సుగుణ రావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: