CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు మండలం లో "పల్లె ప్రగతి" పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్...

Share it:

 



👉 అవెన్యూ ప్లాంటేషన్ పనుల పై అసంతృప్తి.


👉 ప్రభుత్వ పథకాల అమలు విషయంలో మండల అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.


👉 సర్పంచుల పనితీరు అధ్వానంగా ఉందన్న కలెక్టర్.


👉 మీకు పని చేయడం చేతకాక పోతే స్వయంగా నేనే మొక్కలు నాటుతా నన్న కలెక్టర్.

👉 వారంలో మల్లా వస్తా పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరిక.


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని వినోబానగర్ వెంగన్నపాలెం, జూలూరుపాడు, పడమట నర్సాపురం, గ్రామ పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలైన పల్లె ప్రగతి, హరితహారం, అవెన్యూ, ప్లాంటేషన్ పనులను ఆదివారం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పరిశీలించారు. వినోబా నగర్ గ్రామపంచాయతీలో ఆర్ అండ్ బి రోడ్డు పక్కన నాటిన మొక్కలను, మొక్కల మధ్య దూరాన్ని పరిశీలించారు. దూరం ఎక్కువగా ఉండడంతో మధ్యలో మొక్కలు నాటిం చాలని ఎంపీవో రామారావును ఆదేశించారు. ఇంకా ఎంత కాలం నాటుతారని, జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. జూలూరుపాడు, వెంగన్నపాలెం, ప్రధాన రహదారి డివైడర్లలో చేసిన మొక్కలను పరిశీలించి. అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు మధ్య డివైడర్ లో పెంచే మొక్కలు ఇవికావని అన్నారు. మహాగని, టేకు మా, పొగడ, కదంబం, లాంటి రకాలను నాటాలని సూచించారు. వెంగన్నపాలెం కార్యదర్శి అనంత్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ పనుల పై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనుల పై లేదని మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీల పనితీరు అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పడమట నర్సాపురం అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నివేదికలలో ఉన్న ప్రగతి ఫీల్డ్ లెవల్లో ఏదని ఎం డి ఓ, ఎం పి ఓ, ను నిలదీశారు. జూలూరుపాడు మండలం కంటే మారుమూల మండలాలైన దుమ్మగూడెం, చర్ల, మండలాలలో అధికారులు, ప్రజా ప్రతినిధుల, పనితీరు చాలా బాగుందన్నారు. మీకు పని చేయడం చేతకాక పోతే స్వయంగా నేనే వచ్చి మొక్కలు నాటుతున్నని అన్నారు. మొక్కల పోషణ, సంరక్షణ, సరిగాలేదని, వారంలో మళ్లీ వస్తా పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేక అధికారి డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, అధికారులు, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: