CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేనొచ్చి చూసి చెప్తే కానీ పరిశుభ్రం చేయరా.

Share it:

 


👉కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి పారిశుద్య కార్యక్రమాలు చేపట్టు విధంగా

చర్యలు తీసుకోవాలి.

👉అదే కదా మీ బాద్యత, వార్డుల్లో తిరుగుతుంటే ప్రజలు పిర్యాదు చేస్తే తప్ప పటించుకోరా.

👉ఎక్కడా చూసినా

పిచ్చిమొక్కలున్నాయి. 

👉శిధిలావస్టలో ఉన్న భవనాలున్నాయి ఇదేనా పట్టణ ప్రగతి అంటే అంటూ జిల్లా కలెక్టర్ అనుదీప్ కౌన్సిలర్లుపై

ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన్యం టీవీ కొత్తగూడెం జూలై 05 :-

సోమవారం మున్సిపల్ పరిధిలోని 3, 6, 7,9,12,14,15,16,20 వార్డుల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటనతో

ఆకస్మిక తనిఖీ వార్డులో పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించి తక్షణం పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్

అధికారులను ఆదేశించారు. 9వ వార్డులో సమస్యలు తాండవిస్తున్నాయని కౌన్సిలర్ పర్యవేక్షణ లేదని తనకు షోకాజ్ నోటీసు జారీ

చేయాలని, అప్పటికీ విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆసక్తి లేకపోతే పదువుల

నుంది. స్వచ్ఛంగా తప్పుకోవాలని కౌన్సిలర్లుకు సూచించారు. సింగరేణి సంస్థ పరిధిలోని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని తక్షణం

వాటిని కూల్చి వేయాలని చెప్పారు. రాంవరం పార్కు నిర్వహణ అద్వాన్నంగా ఉన్నదని, ఆహ్లాదం కొరకు ఏర్పాటు చేసిన పార్కు

నిర్వహణ లేకపోవడం వల్ల మద్యం తాగుతున్నారని ప్రజలు పిర్యాదు చేశారని, ఎందుకు ఇటువంటి దుస్థితి వచ్చిందని ప్రశ్నించారు.

పార్కులో విద్యుత్ సౌకర్యం లేదు, నిర్వహణ లేదు, పిచ్చి మొక్కలతో అందహీనంగా తయారైందని వారం రోజుల్లో అన్ని మారాలని,

మళ్లీ తాను పర్యటిస్తానని ఆ సమయంలో అపరిశుభ్రత ఉంటే కౌన్సిలర్లును సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మీ వల్ల కాకపోతే

మున్సిపార్టీ నుండి పారిశుద్య కార్యక్రమాలు నిర్వహిస్తామని అందుకు రుసుము చెల్లించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.

రామవరంలో సింగరేణి సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిర్వహణ లేక మురికి కంపు వస్తున్నదని ఇలా ఉంటే ప్రజల

ఆరోగ్యం పాడవుతుంది కదా తక్షణం పరిశుభ్రం చేయించాలని ఆదేశించారు. 3వ వార్డులో డంపింగ్ యార్డు నిర్మాణ పనులను 20

రోజుల్లో పూర్తి చేసి వర్మి కంపోస్టు తయారు చేయాలని చెప్పారు.15వ వార్డులో నిర్మిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని

పరిశీలించి పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణపై ప్రజలను నేరుగా అడిగి

తెలుసుకున్నారు. మొక్కల పెంపకం, పరిసరాలు పరిశుభ్రత, పారిశుద్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి

రోజు చెత్త సేకరణకు వాహనాలు వస్తున్నాయా లేదా మంచినీరు సక్రమంగా వస్తున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

రామవరంలోని

గ్రంధాలయ స్థలాన్ని పరిశుభ్రం చేయించి మొక్కలు నాటాలని చెప్పారు. కోటి వృక్షార్చనలో నాటిన మొక్కల సంరక్షణ బావుందని,

ఇదొక ఆక్సిజన్ పార్కులాగా ప్రజలకు ఉపయోగపడుతుందని, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మున్సిపల్ చైర్మన్ ను అభినందించారు.

మున్సిపల్ పరిధిలోని అంతర్గత రహదారుల్లో మొక్కలు నాటాలని చెప్పారు. 12 వార్డులో నీళ్లు నిల్వ లేకుండా మొరం తోలించాలని

చెప్పారు. ఖాళీస్థలాలను పరిశుభ్రం చేయించుకోవాలని యజమానులకు నోటీసులు జారీ చేయాలని, నిర్దేశిత గడువులోగా పరిశుభ్రం

చేయకపోతే మున్సిపాల్టీ నుండి పరిశుభ్రం చేయించి యజమానుల నుండి రుసులు వసూలు చేయాలని చెప్పారు. రామవరం

మీడియన్ ప్లాంటేషన్ అద్వాన్నంగా ఉన్నదని వారం రోజుల్లో మంచిగా మొక్కలు నాటాలని సూచించారు. రహదారులకు ఇరువైపులా

రెండు లేదా మూడు వరుసల్లో మొక్కలు నాటాలని, అదేవిధంగా మల్టీపర్పస్ మొక్కలు నాటాలని చెప్పారు. లూజు విద్యుత్ వైర్లు

సరిచేయుటకు కొత్తగా విద్యుత్ స్థంబాన్ని వేయు పనులను ప్రారంభించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ

బాధ్యతగా మొక్కలు నాటాలని అవగాహన కల్పించారు. పెరుమాళ్ల విద్యానంద్ ఇంటిని సందర్శించి ఆరు మొక్కలు పంపిణీ చేయడంతో

పాటు మొక్కల ఆవశ్యకత, పారిశుద్యంపై అవగాహన కల్పించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని

సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములై పట్టణాలను పరిశుభ్రంగా తయారు చేయాలని

చెప్పారు. పారిశుద్య సిబ్బంది సమయపాలన పాటించు విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి

అర్జున్, కౌన్సిలర్లు పులి గీత, మోరే రూప, విజయలక్ష్మి, అష్టలున్నీసాబేగం, రాజకుమారి, అజ్మీర సుజాత, పరమేష్ యాదవ్, పల్లపు లక్ష్మణ్

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: