CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పొడుకష్టం,గిరిజన పోడు సాగు దారుల రైతుల భూముల్లో మొక్కలు నాటిన అటవీ అధికారులు

Share it:

 


👉 రైతులు,అటవీ అధికారులు మధ్య తోపులాట.

👉 గిరిజన మహిళకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు. మన్యం టివి;ములకలపల్లి మండలం: మండలం లోని మాదారం బీట్ పరిధిలోని కంపర్ట్ మెంట్ 277,278 లోని సోమారు 60 ఎకరాల గిరిజన పోడు సాగుదారు భూమిలో అడవి అధికారులు మొక్కలు నాటేందుకు వెళ్ళినపుడు వారిని అడ్డుకునేందుకు వెళ్లిన గిరిజన పోడు సాగుదారుల రైతుల మధ్య తోపులాట తో కూడిన ఉద్రిక్తత పరిస్థితులు సంభవించాయి.ఈ తోపు లాటలో గిరిన మహిళ అయిన సంఘం రాములమ్మ 60 సం.లు.ఆస్వస్థతకు గురైది.ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులు వైద్య పరీక్షలు ప్రస్తుతం రాములమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.పోడు సాగుదారులకు అండగా ఉంటున్న సిపిఎం నాయకులు మండల కార్య దర్శి ముదిగొండ రాంబాబు, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ లను వారితో పాటు పదిమంది నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.అటవీ అధికారి కృష్ణ ఫిర్యాదుతో 15 మంది రైతులను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.ఈ పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు వారి పోడు సాగు భూమికి పట్టాలు ఇప్పించాలని మమ్మల్ని అటవీ అధికారులు సాగు చెయ్యనివ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పలు మార్లు కలెక్టర్,తహసీల్దార్, ఐ.టీ.డీ.ఏ. పివో ,ఆర్డీవో,ప్రజాప్రతినిధులకు పలు మార్లు చెప్పుకున్న ఎవరు మాకు న్యాయం చెయ్యడం లేదని గిరిజన పోడ రైతులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు.గత 25 సంవత్సరాల నుండి సాగు చేసు కుంటున్న ఈ భూమిని సాగు చెయ్యనియ్యకుండా అన్యాయంగా అటవీ అధికారులు మమ్ములను అడ్డుకుంటున్నారని,సిఎం కెసిర్ పోడుభూములకు పట్టాలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు పోడు భూములను రైతులు వద్ధ నుండి అన్యాయంగా లాక్కుంటున్నారని గిరిజన రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.ఇప్పకైనా అధికారులు సమగ్ర సర్వే జరిపి మాకు పట్టాలు ఇప్పించాలాని అధికారులను రైతులు వేడుకుంటున్నారు.

Share it:

Post A Comment: