CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెవిన్యూ మరియు అటవీ అధికారులనుండి నాభూమి ని నాకు ఇప్పించండి లేకపోతే నాకు చావే శరణ్యమంటున్న గిరిజన రైతు

Share it:

 


    మన్యం టివి: ములకలపల్లి మండలం: మండలం లోని  జగన్నాధపురం గ్రామ  పంచాయతీ చండ్రుకుంట గ్రామం లో నివసిస్తున్న కోరస రమేష్ కు చెందినటువంటి పోడు భూమిని ములకలపల్లి మండలంలో ని పల్లె ప్రకృతి వనం కొరకు, గత 20 సంవత్సరముల నుండి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాను టువంటి 5  ఎకరాలు పోడు భూమిని రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులు అన్యాయంగా పల్లె ప్రకృతి వనం పేరుతో తీసుకోవాలని చూస్తున్నారని,గతంలో కూడా దీని కొరకు రింగరెడ్డిపల్లి వైపు చుసిన భూమిని గిరిజనేతరులకు తలొగ్గి ,అక్కడినుండి వచ్చి గిరిజనుడు  అయిన నా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని,కావున నా యందు దయ ఉంచి నాయకులు,  ఫారెస్ట్ అధికారులు నా  భూమిని  మినహాయించి మీగత ఫారెస్ట్ భూమిలో  పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసొగలరని మనవి. ఆ పోడు  భూమి లేకపోతే నాకు నా కుటుంబానికి ఆత్మహతే శరణ్యం అని, ఇప్పటికైనా నా విన్నపమును మన్నించి నాకు న్యాయం చేయగలరని అధికారులను వేడుకుంటున్నానాని తెలిపారు.

Share it:

Post A Comment: